లేడీస్ పై హర్భజన్ దూస్రా

స్టార్ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఆడాళ్లతో వేగడం కష్టమని చెప్పాడు. గతేడాది బాలీవుడ్ నటి గీత్రా బాస్రాను వివాహం చేసుకున్న హర్భజన్ ఇప్పటికీ తాను అడవాళ్లను అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపాడు. మామూలుగా ఉన్నా.. గర్భంతో ఉన్న  లేడీస్ డీలింగ్ అంటే కష్టపడాల్సిందేనన్నాడీ టర్బొనేటర్. ఐతే భార్యభర్తల మధ్య మంచి అవహాగన ఉంటే సంసారం సరదాగా సాగిపోతుందని వ్యాఖ్యానించాడు.

ఐతే భార్య గీతా బాస్రాతో వేగలేక అలా అన్నాడో లేక మరేదైనా కారణమోగానీ భజ్జీ కామెంట్స్ ఇప్పుడు ఆన్ లైన్ లో వైరల్ గా మారిపోయాయి. అన్నట్లు ఈ స్టార్ స్పిన్నర్ త్వరలో తండ్రి కాబోతున్నాడు. ఈ నెలాఖరుకు భజ్జీ వైఫ్ గీతా బాస్రా ప్రసవించనుంది. తన బేబీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు హర్భజన్ తెలిపాడు. బిడ్డను ఎలా పెంచాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నదానిపై భజ్జీ దంపతులు ప్రీ-నాటల్ క్లాసులకు కూడా వెళ్తున్నారు.

బ్రిటన్ పౌరురాలైన గీతా బాస్రా.. డెలివరీ కోసం లండన్ లోని ఆస్పత్రిలో చేరనుంది. తమ ఫ్యామిలీలోకి వచ్చే చిన్నిపాపకు గ్రాండ్ వెల్ కమ్ చెప్పేందుకు ఇప్పటి నుంచే షాపింగ్ చేస్తున్నట్లు హర్భజన్ తెలిపాడు.