అసదుద్దీన్ నోట ఆ మాట భేష్

ఎక్కడ ఏ ఉగ్ర అలజడి జరిగినా అందరి కన్ను హైద్రాబాద్ పైనే ఉంటుంది.అయితే తాజాగా హైద్రాబాద్ లక్ష్యంగా ఐసిస్ ఉగ్ర కుట్రను మన NIA చేదించిన విషయం తెలిసిందే. కుట్రకు సూత్రదారులంతా హైద్రాబాద్ కి చెందివారే కావడంతో ఒక్క సారిగా నగరం ఉలిక్కి పడింది.తాజాగా ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ విషయంలో ఎంఐఎం పార్టీ అధినేత లోక్ సభ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. తాము ఐసిస్కు తీవ్ర వ్యతిరేకం అని స్పష్టం చేశారు. తాము ముందునుంచి ఇదే విషయాన్ని చెబుతున్నామని అన్నారు. ఐసిస్ అనేది ఒక అంతమొందించాల్సిన సంస్థ అని ఆయన అన్నారు.ఆయన గతంలో కూడా ఇస్లామిక్ స్టేట్ కి వ్యతిరేకంగా గళం విప్పి బెదిరింపులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.

దీనిపై తమ భవిష్యత్ కార్యాచరణను కూడా తెలియజేసారు.ఐసిస్ అంటే వ్యతిరేక భావజాలం ఉన్న మహ్మద్ అబుల్ హుదా అనే ఓ ప్రముఖ సిరియన్ స్కాలర్ను పిలిపించే ఆలోచనలు చేసినట్లు చెప్పారు. తొలిసారిగా హైదరాబాద్లో ఇటీవల ఐసిస్ సానుభూతి పరులను అరెస్టు చేసిన నేపథ్యంలో ఆయన స్పందించారు. మిలటరీ సహాయంతో ఐసిస్ ను సర్వనాశనం చేయొచ్చని అంతకంటే దాని భావజాలం మొత్తాన్ని కూడా రూపుమాపాలని అన్నారు.అసదుద్దీన్ వ్యాఖ్యలను అన్ని వర్గాల ప్రజలు స్వాగతిస్తున్నారు.