లేడీ ‘చిరుత’ చెల్లెలొస్తోంది

ఇద్దరు అక్క చెల్లెళ్లలో ఒకరు మాత్రమే ఇండస్ట్రీలో సక్సెస్‌ అవ్వగలుగుతున్నారు. ఇప్పుడు బాలీవుడ్‌లో కొత్తగా మరో హీరోయిన్‌ చెల్లెలు తెరంగేట్రం చేయబోతోంది. బాలీవుడ్‌ హీరో అక్షయ్‌కుమార్‌ తన కొత్త సినిమా కోసం ఓ హీరోయిన్‌ చెల్లెల్ని తీసుకొస్తున్నాడు. ‘చిరుత’ సినిమాతో తెలుగు తెరపై హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన నేహా శర్మ సోదరి ఐషా శర్మ, అక్షయ్‌కుమార్‌ హీరోగా నటించనున్న ‘నమస్తే ఇంగ్లాడ్‌’ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైంది. అయితే ఈ సినిమాలో మరో హీరోయిన్‌ కూడా నటిస్తోంది. ఆమె ఎవరో కాదు, బాలీవుడ్‌ భామ సోనాక్షి సిన్హా.

నేహా శర్మ తన సోదరిని ఓ తెలుగు సినిమా ద్వారా హీరోయిన్‌గా తెరంగేట్రం చేయించాలనుకున్నా వీలు కుదరలేదట. ‘చిరుత’ సినిమాతో పూరీ జగన్నాధ్‌ ద్వారా ఈ ముద్దుగుమ్మ తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ సినిమాలో ఆమె బాగా డబ్బున్న పొగరుబోతు అమ్మాయిగా తన పాత్రకు బాగా న్యాయం చేసింది. చరణ్‌ పక్కన డాన్సుల్లో కూడా ఇరగదీసింది. కానీ తెలుగులో ఒకటి, రెండు సినిమాల్లో తప్ప, పెద్దగా నేహా శర్మ హీరోయిన్‌గా సక్సెస్‌ కాలేకపోయింది. దాంతో బాలీవుడ్‌లో తన అదృష్టం పరీక్షించుకుంది. తన ఫేస్‌ ఫీచర్స్‌ బాలీవుడ్‌ ఆడియన్స్‌ని బాగా ఎట్రాక్ట్‌ చేసినట్లుంది. అక్కడ సినిమాలు బాగానే చేస్తోంది. చెల్లెలు ఐషా శర్మ కూడా తెలుగులోనూ, హిందీలోనూ కూడా సినిమాలు చేయడానికి రెఢీగానే ఉందట. ఎక్కడ అవకాశం వస్తే అక్కడ తన సత్తా చూపించాలనుకుంటోందట. మరి ఈ ముద్దుగుమ్మకి బాలీవుడ్‌ ఎంట్రీ కలిసొస్తుందో లేదో చూడాలి మరి