దర్శక ధీరుడు రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబి 29పై అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి విపరీతమైన అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కనున్న ఈ పాన్ వరల్డ్ సినిమాకు మెల్లమెల్లగా అడుగులు దగ్గర పడుతున్నాయి. డిసెంబర్‌లో సినిమా ప్రకటన చేసి జనవరి మొదటి నుంచి షూట్ ప్రారంభించాలని ప్లాన్‌లో ఉన్నారు మేకర్స్. ఇక ఆర్‌ఆర్ఆర్ తర్వాత రాజమౌళి ఇమేజ్ ఆస్కార్ అవార్డుతో టాలీవుడ్ నుంచి జపాన్ వీధుల వరకు పాకిపోయింది. […]