టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా మల్లిడి వశిష్ఠ డైరెక్షన్లో రూపొందిన లేటెస్ట్ మూవీ విశ్వంభర. అంజీ సినిమా తర్వాత చాలా కాలానికి చిరు నుంచి భారీ గ్రాఫిక్స్‌తో వస్తున్న మూవీ కావడంతో మొదట్లో ఈ సినిమాపై మెగాస్టార్ అభిమానుల్లో మంచి అంచనాలు మొదలయ్యాయి. అయితే.. గతంలో రిలీజ్ అయిన టీజర్ తో అంచనాలన్నీ తలకిందులు చేశారు మేకర్స్. కారణం గ్రాఫిక్స్ కంటెంట్ నాసిరకంగా ఉండటమే. ఈ క్రమంలోనే విశ్వంభర టీజర్ కట్స్ ఎన్నో విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. […]