టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇండస్ట్రీలో తిరుగులేని సక్సెస్ రేట్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి తర్వాత ఈ రేంజ్‌లో సక్సెస్‌లు అందుకుంటున్న డైరెక్టర్గా అనిల్ రావిపూడి స్థానాన్ని దక్కించుకున్నాడు. పదేళ్ల క్రితం పటాస్‌తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ఇప్పటివరకు ఫెయిల్యూర్ ఎరుగని దర్శకుడుగా దూసుకుపోతున్నాడు. తనదైన స్టైల్‌లో కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ ఎంట్రటైన్మెంట్‌ను మిక్స్ చేస్తూ ఆడియన్స్‌ను తన సినిమాలకు కనెక్ట్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అనీల్ తెరకెక్కించిన ప్రతి సినిమాను సినీప్రియలు […]