ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్లో రిలీజ్ కి సిద్ధంగా ఉన్న మోస్ట్ అవైతెద్ మూవీ ” సలార్ “. ఈ సినిమా పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ మాసివ్ యాక్షన్ డ్రామా పై పెద్ద ఎత్తున అంచనాలు నెలకొన్నాయి.
అయితే ఈ సినిమా స్టార్ట్ చేసిన నాటి నుంచి కూడా ఈ మూవీ ఒక రీమేక్ మూవీ అని.. అది కూడా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన మొదటి సినిమా ” ఉగ్రం ” కి రీమేక్ అని అనేక రూమర్స్ వచ్చాయి. ఇక ఈ వార్తపై లేటెస్ట్ గా నిర్మాత ఫుల్ క్లారిటీ ఇచ్చాడు.
విజయ్ కిరగందుర్ మాట్లాడుతూ…” సలార్ దేనికి రీమేక్ కాదు. ప్రశాంత్ నీల్ కి కొత్త ప్రాజెక్ట్ ని ఎలా చేయాలో తెలుసు. ఈ సినిమా రీమేక్ అంటూ వచ్చే వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు ” అంటూ చెప్పుకొచ్చారు. ఇక దీంతో ఈ సినిమా రీమేక్ అంటూ వచ్చే పుకార్లు ఆగిపోయాయి. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు చిత్ర బృందం.