గత కొంతకాలంగా టాలీవుడ్ పాన్ ఇండియా రేంజ్‌లో సక్సెస్ సాధిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో చాలామంది బాలీవుడ్ నటీనటులు కూడా టాలీవుడ్ పై మగ్గుచూపుతున్నారు. గతంలో సౌత్ హీరో హీరోయిన్లకు బాలీవుడ్ హీరో, హీరోయిన్ల కంటే రెమ్యునరేషన్ తక్కువగా ఉండడంతో బాలీవుడ్ నటినట్లు టాలీవుడ్ లో నటించడానికి ఆసక్తి చూపేవారు కాదు. అయితే ఇటీవల కాలంలో పాన్ ఇండియా లెవెల్లో హిట్ సినిమాలు తమ ఖాతాలో వేసుకోవడంతో టాలీవుడ్ సినిమాల్లో బాలీవుడ్ హీరో, హీరోయిన్లు కూడా నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే ఆలియా భట్, దీపికా పదుకొనే, జాన్వి కపూర్ ఇలా చాలామంది బాలీవుడ్ నటులు తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.
ఇక వారితో పాటు కియారా అద్వానీ కూడా తెలుగులో రాణిస్తుంది. ఇంతకుముందే కియారా అద్వాని భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాలో నటించింది. ఈ రెండు సినిమాలతో టాలీవుడ్ ఆడియన్స్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది కియారా. తరువాత హిందీలో వరుస సినిమాలో నటిస్తూ వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంటుంది. కియారా తెలుగులో ఆఫర్ వస్తున్న ప్రస్తుతం చేయలేని పరిస్థితిలో ఉందంటున్నారు సినీ విశ్లేషకులు. అయితే ప్రస్తుతం కియారా.. రామ్ చరణ్ చేస్తున్న గేమ్ చేంజర్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
శంకర్ డైరెక్షన్‌లో ఈ సినిమా రూపొందుతుంది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కియారా.. రామ్ చరణ్ కాంబినేషన్లు ఇది రెండవ సినిమా. ఇక కియారా బాలీవుడ్ లో చేసిన సినిమా.. చేసినట్టు హిట్ అవ్వడంతో ఆమెకు బాలీవుడ్ లో మరింత క్రేజ్ పెరిగింది. దీంతో రెమ్యూనరేషన్ అమాంతంగా పెంచేసింది ఈ బ్యూటి. బాలీవుడ్ సినిమాలకు రూ.3 కోట్ల రమ్యరేషన్ అందుకుంటున్న కియారా తెలుగు సినిమాలకు మాత్రం రూ.4 నుంచి 5 కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తేనే కాని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదట. సినిమాలే కాదు క్రేజీ ఫోటోషూట్స్‌తో కూడా ప్రేక్షకులకు పిచ్చెక్కిస్తుంది ఈ బ్యూటి. తన ఘాటు అందాటు ఆరబోస్తు ఆ ఫొటోలు షేర్ చేసి కూడా ఫాలోవర్స్ ని మరింతగా పెంచుకుంది ఈ ముద్దుగుమ్మ.