ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా.. శృతిహాసన్ హీరోయిన్ గా… తెరకెక్కిన లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” సలార్ ” ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. ఎన్నో చిక్కుముడులు, సందేహాల మధ్య సలార్ పార్ట్ వన్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షోకే పాజిటివ్ టాక్ ని దక్కించుకుంది.
ఇక సలార్ 2 మూవీలో వరద తమ్ముని పాత్ర దేవా చేతిలో చనిపోతుందని తెలుస్తుంది. ఈ పాత్ర మరణం వల్లే దేవా, వరద మధ్య గొడవలు ఏర్పడినట్లు ఉగ్రం సినిమా చూసిన ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. అలాగే సలార్ 2 లో ప్రశాంత్ నీల్ మార్పులు చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది.
సౌండ్ ఆఫ్ సలార్ పేరుతో సలార్ యూనిట్ ఒక వీడియోను రిలీజ్ చేయగా ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక సలార్ మూవీకి వస్తున్న రెస్పాన్స్ తో డార్లింగ్ ఫ్యాన్స్ కి సంతోషాన్ని కలిగిస్తుంది. ఇక సలార్ 2 రాబోయే రోజుల్లో మరిన్ని అరుదైన రికార్డులను సొంతం చేసుకోబోతున్న అంటూ కామెంట్లు సైతం వినిపిస్తున్నాయి. ఈ మూవీ ఫస్ట్ వీకెండ్ లోనే సంచలన స్థాయిలో కలెక్షన్స్ ను సొంతం చేసుకోవడం ఖాయమని మేకర్స్ భావిస్తున్నారు.