కళ్యాణ్‌రామ్ ‘ డెవిల్ ‘ ఈవెంట్ కు తారక్ రావడంలేదా.. కారణం అదేనా..?

నందమూరి యంగ్ హీరోస్ కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ మధ్య ఉన్న‌ బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. తమ సినిమాలకు సంబంధించి ఏ వేడుక జరుగుతున్న ఈ బ్రదర్స్ ఇద్దరు ఒకరి మూవీ ఈవెంట్ కు మరొకరు కచ్చితంగా హాజరై సందడి చేస్తూ ఉంటారు. మరి సినిమాకి సంబంధించిన పబ్లిసిటీ ఇస్తూ ఉంటారు. ఇక ఈ అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఒకే స్టేజిపై కనిపించారంటే ఫాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. ఈ నేపథ్యంలో డెవిల్ ఈవెంట్లో ఈ బ్రదర్స్ ఒకే వేదికపై కనిపిస్తే చూడాలని ఫాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత నందమూరి బ్రదర్స్ క‌నిపిస్తే చూడాల‌ని ఆసక్తిగా వేచి చూస్తున్నారు.

ఇక డిసెంబర్ 29న భారీ అంచనాలతో ‘ డెవిల్ ‘ సినిమా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈవెంట్లో ఈ బ్రదర్స్ ఇద్దరు ఒకే వేదికపై కనిపిస్తారంటూ వారిని చూడడానికి రెడీ అవుతున్నారు ఫ్యాన్స్‌. కానీ ఈసారి ఆ ఛాన్స్‌ అభిమానులకు మిస్ అయ్యేలా ఉంది. ‘ డెవిల్ ‘ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ మిస్ అవుతున్నాడంటూ సన్నిహితుల వర్గాల నుంచి సమాచారం అందుతుంది. ఫ్యామిలీలో వెకేషన్ ప్లాన్ చేసుకుంటున్న కారణంగానే తారక్ డెవిల్ ప్రమోషనల్ ఈవెంట్ కు రాలేకపోతున్నాడట. పిల్లలు స్కూళ్ళ‌కు, ఆయన షూటింగ్‌కు వెళ్లి బిజీబిజీగా గడుపుతున్నారు.

అయితే డిసెంబర్ మంత్ ఎండింగ్ కావడం క్రిస్మస్, న్యూ ఇయర్ సెలవులు వరుసగా రావడంతో కొద్దిరోజులు ఈ సెలవులను వెకేషన్ ప్లాన్ చేయాలని ఎన్టీఆర్ భావిస్తున్నాడట. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతోనే ఈసారి.. అన్నకు హ్యండ్ ఇచ్చి వెకేషన్ కు చెకేయాలని ప్లాన్ లో ఉన్నాడట ఎన్టీఆర్. అయితే సహజంగానే డిసెంబర్ నెల అంటే సెలబ్రిటీస్‌కి వెకేషనల్ మంత్. క్రిస్మస్, న్యూ ఇయర్ ను విదేశాల్లో ఎంజాయ్ చేసి ఫ్రెష్ గా న్యూ ఇయర్ లోకి అడుగుపెడుతూ ఉంటారు. ఈసారి తారక్ కూడా అలా ప్లాన్ చేసుకున్నాడట. ఈ కారణంగానే డెవిల్ ప్రమోషన్లకు హాజరు కాలేకపోతున్నాడని తెలుస్తుంది.