న్యూ ఇయర్ సందర్భంగా స్పెషల్ లుక్ లో కనిపించిన తారక్.. ఫుల్ కుష్ అవుతున్న ఫ్యాన్స్.‌.!

గ్లోబల్ స్టార్ తారక్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు సొంతం చేసుకున్న ఈయన.. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ఇక దీంతో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం తారక్ హీరోగా నటిస్తున్నటువంటి యాక్షన్ అండ్ ఎంటర్టైనర్ మూవీ ” దేవర “.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీపై తారక్‌ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక అసలు మేటర్ ఏమిటంటే.. తాజాగా ఎన్టీఆర్ ఓ వెకేషన్ కి వెళ్ళగా అక్కడ తన నుంచి ఒక మిస్మరైజింగ్ గిఫ్ట్ ఫ్యాన్స్ నీ ఉర్రూతలూగిస్తుంది.

తన నుంచి కొత్త ఏడాది క్యాలెండర్గా అయితే తన సరికొత్త లుక్ కి సంబంధించిన పోస్టర్ రిలీజ్ అయింది.
ఇక ఈ పోస్టర్లో తారక్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తూ ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు సాంగ్ కి ముందు పార్టీకి రెడీ అయ్యి వెళ్లే ఇన్నోసెంట్ లుక్స్ లో క్యూట్ గా కనిపించాడు. ఇక దీంతో తారక్ అభిమానులు ఫుల్ కుష్ అవుతున్నారు. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.