పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ పార్ట్ వన్ సీజ్ ఫైర్ డిసెంబర్ 22న ప్రేక్షకులు ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇంకా ఈ సినిమా రిలీజ్ కావడానికి కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో సలార్ రికార్డ్స్ ఎలా ఉంటాయని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేయడం మొదలుపెట్టాయి. కానీ రిలీజ్‌కి ముందే వాళ్లకు పని పడేలా ఉంది. జస్ట్ ప్రీ సేల్స్‌తోనే బాక్సాఫీస్ దగ్గర ప్రభాస్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. ఇక ఇప్పటికే సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ అర్ధరాత్రి నుంచే మాస్ జాతరషురూ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఇక ఈ నేపథ్యంలో అడ్వాన్స్ బుకింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఓవర్సీస్ లో మాత్రం చాలా రోజుల క్రితమే బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఇప్పటికి అక్కడ బుకింగ్స్ కు భారీ రెస్పాన్స్ వస్తుంది. దీంతో డంకీ కలెక్షన్ ఎంత అనేది కూడా ఎవరు పట్టించుకోలేదు. ప్రీ సేల్స్ తోనే యూఎస్ బాక్సాఫీస్ దగ్గర ర్యాంపేజ్ ఆడుతుంది సలార్. రిలీజ్ కు మూడు రోజులు ఉండగానే 1 మిలియన్ డాలర్స్ ను వసూలు చేసింది. ఇంకా 1.5 మిలియన్ డాలర్ టార్గెట్ గా మాత్రమే ఉన్నాయి. ఇక దీనిబట్టి ఓవర్సీస్ లో సలార్ క్రేజ్ ఏ విధంగా ఉందో చెప్పుకోవచ్చు.
మరోవైపు ఇండియాలో బుకింగ్స్ ఓపెన్ అయినా అన్ని ప్రాంతాల్లోనూ హాట్ కేకులా అమ్ముడుపోయాయి. ముఖ్యంగా బెంగుళూరు లాంటి సిటీల్లో సలార్ బుకింగ్స్ సంచలన సృష్టిస్తున్నాయి. మొత్తంగా రిలీజ్‌కు ముందే అడ్వాన్స్ బుకింగ్ తో భారీ కలెక్షన్లు సాధించి రికార్డ్స్ సృష్టించేలా ఉంది సలార్. ఇక షారుక్ ఖాన్ డంకీ థియేటర్లో ఉన్నా కూడా సలార్ డే వన్ ఓపెనింగ్స్ కచ్చితంగా రూ.100 కోట్లకు పైగా ఉంటుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి రిలీజ్ అయ్యాక సలార్ ప్రొడ్యూసర్లకు ఎలాంటి సక్సెస్ ఇస్తుందో చూడాలి.