రవితేజ ” వెంకీ ” మూవీ రీ రిలీజ్ డేట్, టైం పక్కా ఫిక్స్… మంచి హుషారుగా ఉన్నాడుగా…!

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా.. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ ” వెంకీ “. స్మేహా హీరోయిన్గా నటించిన ఈ మూవీ 2004లో రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని దక్కించుకుంది.

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీని లక్ష్మి ప్రొడక్షన్స్ సంస్థ పై అల్లూరి పూర్ణచందర్రావు నిర్మించారు. ఇక ఈ సినిమాని అప్పటి ప్రజలే కాకుండా ఇప్పటి తరం కూడా ఎంతగానో ఆదరిస్తారు.
ఇక అసలు మేటర్ ఏమిటంటే… డిసెంబర్ 30న ఈ మూవీ గ్రాండ్ లెవెల్ లో రీ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

 

కాగా వెంకీ రీ రిలీస్ ట్రైలర్ ని రేపు ఉదయం 11 గం.లకు రిలీజ్ చేయనున్నట్లు ఓ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు మేకర్స్. ఇక ఈ తరం ఆడియన్స్ ని వెంకీ మూవీ ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి మరి. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.