– స్రీమింగ్ అవుతాయి. ఇక ఇదిలా ఉంటే తాజాగా మెగాస్టార్ ఇంటికి నెట్ ఫ్లిక్స్ పెద్దలు వెళ్లారు. చిరంజీవితో పాటు రామ్ చరణ్, అలాగే ఇతర మెగా హీరోలను సైతం కలిశారు.
ఇక వీరు ఎందుకు వెళ్లారు? అసలు కారణం ఏంటి? అనే వాటిపై క్లారిటీ లేనప్పటికీ.. ప్రస్తుతం వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ ఇంటికి వెళ్లిన వ్యక్తి నెట్ ఫ్లిక్స్ సీఈఓ టెడ్ సరాండోస్. ఈయన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగిన వెంటనే సరాసరి మెగాస్టార్ ఇంటికే వెళ్ళాడు.
ఈ నేపథ్యంలోనే ఈయనకి మెగా హీరోలు సాదర స్వాగతం పలికారు. అనంతరం కాసేపు మాట్లాడుకున్నారు. ఇక ఆ తర్వాత ఫోటోలకు స్టిల్స్ ఇస్తూ ఎంజాయ్ చేశారు. ఇక వీరు మెగా ఫ్యామిలీ ఇంటికి ఎందుకు వెళ్లారు అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.