బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. షోలో పాల్గొన్న కంటెస్టెంట్స్ ఎవరైనా సరే ఒక్కసారిగా స్టార్ సెలబ్రిటీస్ అయిపోతారు. అంతకుముందు ముక్కు మొహం కూడా తెలియని వారైనా సరే భారీ పాపులారిటీ దక్కించుకుంటారు. కంటాస్టెంట్స్ ఫ్యాన్స్ మధ్య కొట్లాటలు, సోషల్ మీడియా వార్స్ కూడా ఇటీవల సర్వసాధారణం అయిపోయాయి. అలా ఈ షో లో కంటిస్టెంట్గా అడుగుపెట్టిన ఓ వ్యక్తి మీద అభిమాని పుస్తకం కూడా రాశాడు. ఇది బిగ్‌బాస్ చరిత్రలోనే మొదటిసారి. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు.. ఎవరిపైన పుస్తకం రాశారు.. అనుకుంటున్నారా.
బిగ్ బాస్ సీజన్ 7 రనరప్ అమర్‌దీప్ చౌదరి. అవును అమర్ వీరాభిమాని వినూత్న రీతిలో అతడిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. కొందరు అభిమానుల రాసిన లెటర్స్ అన్నింటినీ కలిపి పుస్తకంగా మార్చేశి అమర్‌కి సర్పరైజ్ ఇచ్చాడు. నా మీద పుస్తకమా అంటూ అమర్‌దీప్ ఆశ్చర్యపోయాడు. ఇటీవల జరిగిన స్టార్ మా పరివార్ షోలో అమర్‌కి దాని అందజేశాడు. అమర్‌దీప్ వేదిక మీదకి రాగానే ఫ్యాన్స్ గట్టిగా అరుచుకుంటూ హడావిడి చేశారు. నువ్వు రన్నర్ అయితే ఏ మాకు విన్నర్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం అభిమానులు రాసిన పుస్తకాన్ని శ్రీముఖి అమర్‌కి చూపించింది.
దీంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అమర్ షోలో ఆశించిన స్థాయిలో రాణించ లేకపోయినా అతని అమాయకత్వం, తెలివితేటలు, బలహీనతలు ఈ షోలో అతనికి ప్లస్ అయ్యాయి. అతడు రైతుబిడ్డ ట్యాగ్‌తో హౌస్ లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ పట్ల వ్యవహరించిన తీరు కాస్త వివాదాస్పదమైన సంగతి కూడా తెలిసిందే. ఇక హౌస్‌లో టాస్క్‌లను కూడా అంతంత మాత్రమే ఆడిన అమర్ తన అమాయకత్వంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక దీంతోపాటు అమర్‌దీప్‌కి సీరియల్ హీరోగా మంచి ఫ్యామిలీ ఉంది. దీంతో అమర్ రన్నరప్‌గా చివరి స్టేజ్ వరకు నిలిచాడు.