ఉప్పెన సినిమాతో టాలీవుడ్ హీరోయిన్గా అడుగు పెట్టింది కృతి శెట్టి. ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఫస్ట్ మూవీ విడుదలకు ముందే సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ ముద్దుగుమ్మ తన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఉప్పెన తర్వాత బేబమ్మకు ఆఫర్స్ క్యూ కట్టాయి. వెంట వెంటనే స్టార్ హీరోల సరసన ఛాన్సులు కొట్టేసింది. దీంతో తక్కువ సమయంలోనే స్టార్డమ్ అందుకున్న ఈ బ్యూటీ కి సక్సెస్ మాత్రం కలిసి రాలేదు.
ఆమె నటించిన సినిమాలు వరుసగా డిజాస్టర్లు అవడంతో కృతి శెట్టికి అవకాశాలు తగ్గిపోయాయి. ప్రస్తుతం ఆమె చేతిలో ఒకటి రెండు సినిమాలు మాత్రమే ఉన్నాయి. అయితే ట్రెడిషనల్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న కృతి ఇటీవల తన రూట్ మార్చింది. సోషల్ మీడియాలో గ్లామర్ డోస్‌ను పెంచేసింది బేబమ్మ. తాజాగా బ్యాక్ లెస్ బ్లాక్ డ్రెస్ లో గ్లామర్ ఫోజులతో కుర్రాలను కవ్వించింది.. రొమాంటిక్ స్టిల్స్ తో హాట్ ట్రీట్ ఇచ్చింది.
ఈ బ్యూటీ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో గ్లామర్ షోకు దూరంగా ఉండడంతో ట్రెడిషనల్ బ్యూటీగా ఫిక్స్ అయిన ఫ్యాన్స్ అంతా ప్రస్తుతం కృతి శెట్టి గ్లామర్ షో పిక్స్ వైరల్ అవ్వడంతో షాక్ అవుతున్నారు. మరికొంతమంది ఇండస్ట్రీలోకి ఒకసారి అడుగుపెట్టిన తరువాత ఇవన్నీ కామన్.. ఎంత ట్రెడిషనల్ బ్యూటీ అయినా అవకాశల కోసం గ్లామర్ షో చేయక తప్పదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.