ఇండ‌స్ట్రీలో ఎలా మెల‌గాలో ఆయ‌న ద‌గ్గ‌రే నేర్చుకున్నా.. అలియా భట్ కామెంట్స్ వైర‌ల్‌..!!

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా క్రేస్ తెచ్చుకున్న అలియా భట్ ” హార్ట్ ఆఫ్ స్టోన్ ” తో హాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇస్తుంది. తాజాగా అలియా భట్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన కెరీర్‌కు సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చింది. ఇంతకీ అలియా ఏం మాట్లాడింది అంటే.. ” దర్శకులు సంజయ్ లీల భన్సాలీ , కిరణ్ జోహార్ ల నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను.

అలాగే హీరో షారుక్ వల్లే నేను సెట్ లో ఎలా మెలగాలో తెలుసుకున్నాను ” అని అలియా చెప్పుకొచ్చింది. అలాగే తాను చేసిన ప్రతి సినిమా నుంచి ఏదో విషయం నేర్చుకున్నాను అంటూ అలియా భట్ తెలిపింది. ప్రస్తుతం నేను సెట్లో అందరితో ఎలా కలిసిమెలిసి ఉంటున్నానో.. అది షారుక్ నుంచి నేర్చుకున్నాను.

ప్రతి సన్నివేశాన్ని ఎలా అర్థం చేసుకోవాలో షారుక్ కి బాగా తెలుసు. నేను కూడా ఈ విషయంలో షారుక్‌ని చూసి నేర్చుకున్నాను. నాపై ప్రభావం చూపిన వ్యక్తుల్లో షారుక్ ముఖ్యమైన వ్యక్తి ” అంటూ అలియా తెలిపింది. ప్రస్తుతం అలియా భట్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.