సామాజిక మాధ్యమాలతో టాలెంట్ ఉన్న ఎవరైనా సెలబ్రిటీలు కావచ్చు. తమ టాలెంట్ నిరూపించి లక్షలు సంపాదించుకోవచ్చు. అలా వెలుగులోకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో షణ్ముఖ్ జస్వంత్ కూడా ఒకడు. షణ్ముఖ్ యాక్టింగ్, డాన్స్ అంటే ఉన్న ఇష్టంతో యూట్యూబ్లో షార్ట్ ఫిలిమ్స్ కవర్ సాంగ్స్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇతను నటించిన కొన్ని వెబ్ సిరీస్ లు భారీ రేంజ్ లో సక్సెస్ అందుకోవడంతో ముఖ్యంగా సాఫ్ట్వేర్ డెవలపర్ సిరీస్ సూపర్ హిట్ కావడంతో సోషల్ మీడియాలో స్టార్ హీరోగా ఎదిగాడు. తర్వాత బిగ్బాస్ హౌస్లో కంటిస్టెంట్గా అడుగుపెట్టి తన ఇమేజ్ మరింత పెంచుకున్నాడు.
స్ట్రాంగ్ కంటిస్టెంట్ గా షణ్ముఖ టైటిల్ అంచుల వరకు వెళ్లి చేజార్చుకున్నాడు. వీజే సన్ని, షణ్ముఖ టైటిల్ రేస్ లో నిలిచారు. విజే సన్నీ విన్నర్ కాగ, షణ్ముఖ రనరప్గా అయిపోయాడు. ఈ షోద్వారా భారీగానే అర్జించాడట. తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహా షణ్ముఖతో వెబ్ సిరీస్ చేసింది. ఇక యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో డ్యాన్స్ వీడియోలు షేర్ చేస్తూ కూడా బాగానే సంపాదిస్తున్నాడు షణ్ముఖ్. అతడి సంపాదన కోట్లకు చేరిందని న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అతడికి వివిధ మార్గాల ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం వస్తుంది. అలాగే ఇన్ఫినిటీ మీడియం వారు నెలకు రూ.5 లక్షలు ఇస్తున్నట్లు సమాచారం.
ఇక విశ్వసనీయ వర్గాల అంచనాల ప్రకారం షణ్ముఖ్ ఆస్తి విలువ రూ.20 కోట్లకు పైగా ఉంటుంది. ఇక ఇటీవల ఓ లక్సరీ కారుని కూడా కొనుగోలు చేసాడు షణ్ముఖ్. గతంలో తన లవర్ దీప్తి సునయనతో ఎన్నో వీడియోలు చేసి పాపులారిటీ దక్కించుకున్న షణ్ముఖ్ బిగ్బాస్ సీజన్ 5 లో పాల్గొన్న తోటి కంటెస్టెంట్ సిరి హనుమంత్తో రొమాన్స్ చేశాడు. వీరిద్దరు హౌస్లో హద్దులు మీరి ప్రవర్తించారు. దీంతో షణ్ముఖ్, సిరి ఎఫైర్ చర్చకు దారితీసింది. దీంతో దీప్తి సునయన అతడు బయటకు వచ్చాక బ్రేకప్ ప్రకటించింది. 2021 నుంచి వీరు విడివిడిగా ఉంటున్నారు.