నాని ” హాయ్ నాన్న ” నుంచి ఫస్ట్ చార్ట్ బ్లాక్ బస్టర్ సాంగ్ ఇదే….!!

నాచురల్ స్టార్ నాని హీరోగా తన కెరీర్‌లో సెన్సేషనల్ హిట్ మూవీ ” దసరా “. ఈ సినిమా తరువాత తన కెరీర్‌లో బెంచ్ మార్క్ మూవీ ” హాయ్ నాన్న ” చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా నుంచి అయితే.. మేకర్స్ ఇప్పుడు మొట్ట మొదటి సాంగ్ ని రిలీజ్ చేశారు.

సమయమా అనే ఈ లిరికల్ సాంగ్ ని అనురాగ్ కులకర్ణి ఆలపించగా ఇన్స్టంట్ గా క్లిక్ అయ్యే సాంగ్ లా అయితే ఇది కనిపించింది. అలాగే ఆల్రెడీ ఖుషి సినిమాతో అయితే చార్ట్ బస్టర్ ఆల్బమ్ ని అందించిన సంగీత దర్శకుడు హిషం అబ్దుల్ వహద్.. ఈ సినిమాకి కూడా అదిరే ఫస్ట్ సాంగ్ ని ఇచ్చాడు అనే చెప్పొచ్చు. మరి ఫుల్ ఆల్బమ్ లో మిగతా సాంగ్స్ ఎలా ఉంటాయో చూడాలి.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ నటిస్తుంది. అలాగే యువ దర్శకుడు శౌర్యువ్ ఈ సినిమాకి దర్శకత్వ బాధ్యతకు చేపట్టి డెబ్యూ ఇవ్వబోతున్నాడు. అలాగే వైరా ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది.