టేస్టీ మిల్ మేక‌ర్ రోల్స్.. చిటికెలో త‌యారీవిధానం.. !!

మిల్ మేకర్ రోల్స్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు:
1.చపాతీలు – 5(గోధుమ పిండిలో తగినన్ని నీళ్లు పోసుకుని చపాతీలు చేసుకుని వేయించి పక్కన పెట్టుకోవాలి)
2. మిల్ మేకర్ – 2 కప్పులు (ముందుగా వేడి నీళ్లలో వేసుకుని కాసేపు ఉంచాలి. నీళ్లు వాడిన వెంటనే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక నిమిషం పాటు అటు ఇటుగా రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి)
3. క్యాప్సికమ్, టమాటో-2 చప్పున (ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి)
4. ఉల్లిపాయలు- 2 (సగం గార్నిష్ కి)
5. పచ్చిమిర్చి – 4 (చిన్నచిన్న ముక్కలు కట్ చేసుకోవాలి)
6. బ్రెడ్ పౌడర్, మొక్కజొన్న పిండి – 2 టేబుల్ స్పూన్ల చొప్పున వేసుకోవాలి.
7. మిరియాల పొడి, జీలకర్ర పొడి, అర టీ స్పూన్ చొప్పున వేసుకోవాలి.
8. పసుపు చిటికెడు, టమాటో కెచప్ ఒక టీ స్పూన్.
9. ఉప్పు తగినంత, నూనె సరిపడా

తయారీ విధానం:
ముందుగా నూనెలో సగం ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కాసేపు వేగించి.. అందులో పచ్చిమిర్చి , క్యాప్సికం, టమాటో, మిల్ మేకర్ ఇలా ఒకదాని తరువాత ఒకటి వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకుని కూరలా దగ్గరపడే వరకు ఉడికించుకోవాలి. తర్వాత బ్రెడ్ పౌడర్, మొక్కజొన్న పిండి, జీలకర్ర పొడి, తగినంత ఉప్పు, టమాటో కెచప్ వేసి గరిటతో తిప్పుతూ ఉండాలి. చివరగా కాల్చిన చపాతీల్లో.. ఓవైపు ఈ కర్రీ వేసుకుని రోలింగ్ చుట్టుకోవాలి. మిగిలిన ఉల్లిపాయ ముక్కలతో వేడివేడిగా ఉన్నప్పుడే వీటిని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.