” స్కంద ” మాస్ మూవీ ఏ కాదు…. ఫ్యామిలీ ఎంటర్టైనర్ కూడా…..ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రామ్….!!

యంగ్ హీరో రామ్ – బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ” స్కంద “. ఈ మూవీ ఈనెల 28న గ్రాండ్ గా పలు భాషల్లో ఆడియన్స్ ముందుకి రానుంది. శ్రీ లీల హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్‌ చిట్టూరి దీనిని భారీ స్థాయిలో పాన్ ఇండియన్ రేంజ్ లో నిర్మించాడు.

ఇక నేడు స్కంద యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ కరీంనగర్లో వైభోగంగా జరిగింది. ఈ సందర్భంగా హీరో రామ్ మాట్లాడుతూ..” స్కంద కోసం టీం మొత్తం ఎంతో కష్టపడ్డారని చెప్పాడు. ఇక దర్శకుడు బోయపాటి శ్రీను గత సినిమాల మాదిరిగా స్కందాని కూడా ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని… ఆయన సినిమాల్లో కేవలం మాస్ సీన్స్ మాత్రమే కాదు వాటితో మంచి ఎమోషన్స్ కనెక్ట్ అయి ఉంటాయని తెలిపాడు.

మొదటినుంచి తనకు ఎంతో సపోర్ట్ గా నిలుస్తున్న ఫ్యాన్స్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పిన రామ్… స్కంద కేవలం మాస్ మూవీ మాత్రమే కాదు ఫ్యామిలీ ఎంటర్టైనర్ కూడా అని అన్నాడు. తప్పకుండా మూవీ మంచి సక్సెస్ అందుకుంటుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు రామ్”. ప్రస్తుతం రామ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.