పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న వరుస సినిమాల్లో ‘OG’ కూడా ఒకటి.. క్రేజీ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కోసం పవన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు ప్రధాన కారణం ఇప్పటివరకు వరస రీమెక్ సినిమాలో నటించిన పవన్ ‘OG’ మాత్రం డైరెక్ట్ తెలుగు స్టోరీ తో చేస్తున్నాడు.
ఇక దీంతో ఈ సినిమాపై అంచనాలను భారీగా పెరిగాయి. ఇక రీసెంట్గా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ టీజర్ పవన్ అభిమానులను ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. ఈ టీజర్ విడుదల చేసిన 24 గంటల్లోనే 730k లైక్స్ 17 మిలియన్‌కు పైగా వ్యూస్ సాధించింది. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా ఓవర్ సీస్ డీల్ కూడా క్లోజ్ అయినట్టు తెలుస్తుంది. ఈ సినిమాకు ఓవర్ సీస్ లో ఏకంగా రూ.13 కోట్లకు పైగా రేటు వచ్చినట్టు తెలుస్తుంది.
ఈ సినిమాను ఓ ఇంగ్లీష్ఈ సినిమాను ఫారన్ ఫిలిమ్స్ సంస్థ తీసుకున్నట్టు టాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఈ రీసెంట్ టైమ్స్ లో పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలతో పోల్చుకుంటే ఇది మంచి రేటునే చెప్పాలి. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.