ఒక్క‌ ముక్కతో 150 వ్యాధులకు చెక్.. రణపాల మొక్క ఉపయోగాలు ఇవే..!

ప్రకృతిలో మనకు తెలియని ఎన్నో ఔషధ గుణాలు ఉన్న మొక్కలు ఉంటాయి. మన చుట్టూనే ఆ మొక్కలు పెరుగుతున్న కానీ మనం వాటిని గుర్తించలేం. మనం అలంకరణ కోసం పెంచే మొక్కల్లో కూడా ఔషధ గుణాలు ఉంటాయి. ఆ లిస్ట్‌లో రణపాల మొక్క ఒక‌టి. రణపాల మొక్కని ఇళ్లల్లో మరియు ఆఫీసుల వద్ద డెకరేటివ్ ప్లాంట్ గా వాడుతూ ఉంటారు. అయితే రణపాల మొక్క అలంకారానికే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతగానో సహకరిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 150 వ్యాధులకు చెక్ పెట్టగల సామర్థ్యం రణపాల మొక్కలో ఉంటుందట. రణపాల మొక్క నయం చేయగల వ్యాధుల్లో కొన్ని వ్యాధుల గురించి ఇప్పుడు చూద్దాం. పైన చూపించిన ఈ పిక్ లో విధంగానే రణపాల ఆకు చూడడానికి తలసరిగా రుచి వగరు, పులుపుగా ఉంటుంది. ఈ మొక్క ఆకుల నుండే వేర్లు వస్తాయి. కనుక ఆకులను నాటడం ద్వారా కూడా మొక్కను పెంచవచ్చు. ఈ మొక్కలు యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ వైరల్, యాంటీ మైక్రోబయోల్‌తో పాటు అనాఫిలాక్టిక్ గుణాలు కూడా ఎక్కువగా ఉంటాయి.కనుక ఈ ఆకును తినడం, దీంతో కషాయం తయారు చేసి తీసుకోవడం గాయం తగిలిన చోట ఆకు రుబి కట్టు కట్టడం ద్వారా చాలా ఉపయోగాలు ఉంటాయి.

దీని ఆకులు తినడం వల్ల హై బీపీ బ్యాలెన్స్ అవుతుంది. అదేవిధంగా డయాబెటిస్, కిడ్నీ సమస్యలను కూడా తగ్గిస్తుంది. దీని ఆకులను వేడి చేసి గాయాల పైన పెట్టడం వల్ల గాయాలు త్వరగా మానుతాయి. ఇక ఆకులను నూరి పొట్టుగా తలపై పెట్టుకుంటే తలనొప్పి సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. ఈ ఆకుల పసురుని రెండు చుక్కలు చెవిలో వేసుకుంటే చెవి నొప్పి తగ్గుతుంది. రోజు 2 ర‌ణ‌పాల ఆకుల‌ను తినడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది అని నిపుణులు చెప్తున్నారు. ఇదే విధంగా ఇంకా ఎన్నో సమస్యలకు రణపాల ఆకుతో చేత్తో పెట్టవచ్చట.