టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌ల‌ ఫేవరెట్ స్టార్ హీరోలు ఎవ‌రో తెలిస్తే షాక్ అవుతారు..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో పదుల సంఖ్యలో స్టార్ డైరెక్టర్స్ ఉన్న సంగతి తెలిసిందే. వారిలో టాప్ 10 డైరెక్టర్ జాబితాలో ప్రధానంగా రాజమౌళి, ప్రశాంత్ నీల్‌, సుకుమార్, త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీను, కొరటాల శివ, వంశీ పైడిపల్లి పేర్లు వినిపిస్తున్నాయి. ఇక‌ ఈ స్టార్ డైరెక్టర్ కి ఇష్టమైన స్టార్ హీరోలెవరో తెలుసుకోవాలని ఆసక్తి చాలామంది ప్రేక్షకుల్లో ఉంటుంది. వీరి ఫేవరెట్ హీరోస్ ఎవరో ఒకసారి చూద్దాం. దర్శక ధీరుడు రాజమౌళి ఇప్పటికే చాలామంది స్టార్ హీరోలతో కలిసి పనిచేసిన జక్కన్నకు జూనియర్ ఎన్టీఆర్ అంటేనే ఎక్కువగా ఇష్టమట.

జూనియర్ ఎన్టీఆర్ తో నాలుగు సినిమాలను రూపొందించిన రాజమౌళి రాబోయే రోజులు మరికొన్ని సినిమాలను తర్కెక్కించాలనుకుంటున్నాడు. మరో స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా తన ఫేవరెట్ హీరో జూనియర్ ఎన్టీఆర్ అని ఓ సందర్భంలో స్వయంగా రివీల్ చేశాడు. ఇక స్టార్ డైరెక్టర్ సుకుమార్ కు ఫేవరెట్ హీరో బన్నీ అట. ఈ కాంబినేషన్లో ఇప్పటికే ఆరి, ఆర్య 2, పుష్ప సినిమాలు వ‌చ్చి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ సాధించాయి.

మరో స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈయనకు నందమూరి నట‌సింహం బాలకృష్ణ ఫేవరెట్ హీరో. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలని బ్లాక్ బస్టర్ హిట్స్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే అఖండ 2 సినిమాకి వీరిద్దరూ కలిసి పని చేయబోతున్నారు. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంతగానో ఇష్టమని చాలా మందికి తెలుసు. ఇక కొరటాల శివకు ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు అంటే ప్రత్యేకమైన అభిమాన మాట. పూరి జగన్నాథ్ కూడా మహేష్, ఎన్టీఆర్ లను ఎంతగానో అభిమానిస్తారు. డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఫేవరెట్ హీరో మహేష్ బాబు అని సమాచారం.