రిలీజ్ కాకముందే ‘ RRR ‘ రికార్డ్‌ను బ్రేక్ చేసిన ‘ సలార్ ‘

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ – డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌ కాంబినేషన్లో రూపొందుతున్న మూవీస్ స‌లార్ . ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా మొదటి పార్ట్‌ షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది.

రిలీజ్‌కి ముందే సలార్ మూవీ ‘ ఆర్ఆర్ఆర్ ‘ రికార్డులను బ్రేక్ చేసింది. అది కూడా అమెరికాలో కావడం విశేషం. ఇప్పటికే స‌లార్‌ మూవీని ఆ దేశంలో అన్నీ సినీమార్క్‌ థియేటర్లలో రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు మూవీ టీం. ఆర్ఆర్ఆర్ మూవీ అక్కడ 285 సినీ మార్క్‌ థియేటర్లో రిలీజ్ అయి రికార్డ్ క్రియేట్ చేయగా ప్రస్తుతం ప్రభాస్ స‌లార్ మూవీ దానిని అధిగమించింది.

అమెరికాలో ఏకంగా 1980 కి పైగా స్క్రీన్ లలో రిలీజ్ కాబోతుందని స‌లార్ యూఎస్ డిస్ట్రిబ్యూటర్స్ వివరించారు. మొత్తానికి సలార్ మూవీ రిలీజ్‌కి ముందే ‘ ఆర్ఆర్ఆర్ ‘ రికార్డులను బ్రేక్ చేసిందంటూ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ నుంచి మంచి రెస్ప‌న్స్ రాగా ట్రైలర్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమా రిలీజ్ అయి ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో? చూడాలి.