ఎంత అందం ఉన్నా శ్రీలీలకు ఏం లాభం ఇప్పటికి ఆ సుఖం లేదుగా..!?

ప్రస్తుతం తెలుగులో సూపర్ క్రేజ్‌తో దూసుకుపోతున్న హీరోయిన్లలో శ్రీ లీల ముందు వరుసలో ఉంటుంది. కేవలం తన అందంతోనే కాకుండా నటన, డాన్స్ తో అతి తక్కువ సమయంలోనే ఈ బ్యూటీ భారీ స్టార్ డంను అందుకుంది. ఇటు యంగ్ హీరోలతో పాటు అటు స్టార్ హీరోలకు కూడా ఎంతో లక్కీ హీరోయిన్గా మారిపోయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో దాదాపు పది సినిమాలకు పైనే ఉన్నాయి అంటే ఈమె ఎంత బిజీగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.

ఇదే సమయంలో మరికొద్ది రోజుల్లో శ్రీలీలా స్కంద సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మాస్ డైరెక్ట‌ర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ సినిమాలో రామ్ పోతినేని హీరోగా నటించాడు. శ్రీ లీల హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, పృథ్వీ రాజ్, ప్రిన్స్ సిసిల్, గౌతమి, ఇంద్రజ వంటి అగ్ర నటులు కీలకపాత్రలో నటిస్తున్నారు. సెప్టెంబర్ 15న ఈ సినిమా ఎంతో గ్రాండ్ గా ప్రేక్షకులు ముందుకు రాబోతుంది.

ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయి. ఇక నిన్న స్కంద మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వైట్ శారీ కట్టుకొని శ్రీలీలా ఎంతో అందంగా మెరిసిపోయింది.. ఈవెంట్ కే ఈమె స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. అయితే ఈవెంట్లో యాంకర్ సుమ శ్రీలీలతో మాట్లాడుతూ లవ్ ప్ర‌పోజ‌ల్స్ ప్రస్తావన తెచ్చింది.. ఇప్పటివరకు మీకు ఎప్పుడైనా లవ్ ప్ర‌పోజ‌ల్స్ వచ్చాయా..? అంటూ సుమ శ్రీలీలను ప్రశ్నిస్తుంది.

శ్రీలీలా అందం గురించి ఎంత చెప్పుకున్న త‌క్కువే.. అమ్మాయిలు యావరేజ్ గా ఉంటేనే ఎన్నో లవ్ ప్రపోజల్స్‌ వస్తుంటాయి. అలాంటిది శ్రీలీల‌ వంటి అందగత్తెకు ఇంకెన్ని వచ్చి ఉంటాయని అందరూ ఆమె సమాధానం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ శ్రీలీల‌ తనకు ఇంతవరకు ఒకటంటే ఒక లవ్ ప్రపోజల్ కూడా రాలేదంటూ పెద్ద బాంబు పేల్చింది. ఆన్సర్ కు సుమ మాత్రమే కాదు చాలామంది ఒక్కసారిగా అవ్వకయ్యారు.

ఈ క్ర‌మంలోనే కొంద‌రు ఎంత అందం ఉన్నా ఏం లాభం.. శ్రీ‌లీల‌కు ఇంత‌వ‌ర‌కు ఒక్క ల‌వ్ లెట‌ర్ కూడా రాలేదంటూ సెటైర్లు వేస్తున్నారు. అయితే సెప్టెంబ‌ర్ 15 నుంచి త‌న‌కు ల‌వ్ ప్ర‌పోజ‌ల్స్ రావొచ్చేమో అంటూ శ్రీ‌లీల ఈ సంద‌ర్భంగా పేర్కొంది. ఎందుకంటే, అదే రోజు స్కంద రిలీజ్ కాబోతోంది. మ‌రి ఇందులో శ్రీ‌లీల ఈ మేర‌కు ఆక‌ట్టుకుంటుందో చూడాలి.