టాలీవుడ్ లవ్ బర్డ్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి త్వరలోనే మూడు ముళ్ల బంధంతో ఒకటి కాబోతున్న సంగతి తెలిసిందే. మిస్టర్ సినిమాలో వరుణ్, లావణ్య తొలిసారి జంటగా నటించారు. అలాగే ఈ సినిమా తర్వాత అంతరిక్షంలో కూడా వీళ్ళిద్దరూ మరోసారి జంటగా నటించారు. అయితే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్లు… తొలిచూపులోనే లావణ్య తో వరుణ్ ప్రేమలో పడ్డాడట. లావణ్య త్రిపాఠికి ఫస్ట్ ప్రపోజ్ చేసింది కూడా వరుణ్ తేజ్ అట.
దాదాపు ఏడేళ్ల నుంచి లవ్ లో ఉన్న ఈ జంట. ఏడడుగులతో తమ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఫిక్స్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరి కుటుంబ సభ్యులను ఒప్పించి.. ఇటీవల ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. నవంబర్లో వీరి వివాహం జరగబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా రాలేదు. ఇకపోతే గతంలో వరుణ్ కంటే లావణ్య నే పెద్దది అంటూ ప్రచారం జరిగింది. కానీ అది నిజం కాదు. ఇద్దరూ ఒకే ఏడాదిలో పుట్టారు. లావణ్య కంటే వరుణ్ 11 నెలల పెద్దోడు. కానీ ఒక్క విషయంలో మాత్రం వరుణ్ కంటే లావణ్య నే పెద్దదట.
లావణ్య త్రిపాఠి నటిగా వరుణ్ కంటే సీనియర్. ఈ ముద్దుగుమ్మ 2012లో `అందాల రాక్షసి` సినిమాతో సిని రంగానికి పరిచయం అయింది. తొలి సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక లావణ్య ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రెండేళ్ల తరువాత అంటే 2014లో ముకుంద చిత్రంతో వరుణ్ తేజ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. అలా ఫిల్మ్ కెరీర్ లో వరుణ్ కంటే లావణ్యనే సీనియర్ అయ్యింది. ఈరోజు వరుణ్ తేజ్ హీరోగా నటించిన గాండీవిధార అర్జున సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రవీణ్ సత్తారు ఈ సినిమాకి దర్శకత్వం వహించగా… సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది.