జపాన్ లో ఫేమస్ అయిన మచా టీ ని ఎప్పుడైనా తాగారా.. ఈ టీలో ఎన్నో ఊహించని ప్రయోజనాలు ఉన్నాయి. మచా టీ అంటే ఒక రకమైన గ్రీన్ టీ. ఆకుపచ్చ రంగులు మంచి వాసనతో ప్రత్యేకమైన పోషక విలువలు ఉండుట వలన బాగా ప్రసిద్ధి చెందింది. మచా టీలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటం వలన ఫ్రీ రాడికల్స్ తో పోరాడటం చేసి సెల్ డామేజ్ నుంచి రక్షించడంలో సహాయపడుతుంది.
ఈ టీ లో కొంచెం కెఫిన్ ఉంటుంది. కాఫీతో పోలిస్తే ఇది స్థిరమైన శక్తి బూస్టర్ గా చెప్పవచ్చు. అలాగే గుండె ఆరోగ్యానికి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మచా టీ జీవనక్రియ రేటును పెంచి కొవ్వును కరిగిస్తుంది. శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. అలాగే రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండడానికి సహాయపడుతుంది. మచా టీ ఒత్తిడి మరియు ఆందోళన లేకుండా మనస్సును ప్రశాంతపరుస్తుంది, చర్మ సమస్యలు, తలనొప్పి వంటి సమస్యలను మెరుగుపరుస్తుంది.
వయసు పెరుగుతున్నప్పుడు వచ్చే ఎముకుల బలహీనత నీ కూడా బలంగా చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ నియంత్రణలో సహాయపడుతుంది. వీటిలో విటమిన్ కే, లుటీన్ సమృద్ధిగా ఉండటం వలన మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే జ్ఞాపక శక్తి సమస్యలు లేకుండా చేస్తుంది. అయితే మచా టీని పరగడుపున తాగకూడదు. తాగితే కడుపుకి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది.