మాటలు రాని మూగ‌మ్మాయ్‌… అయినా సౌత్‌లో క్రేజీ హీరోయిన్‌..!

దేవుడు అన్ని ఇచ్చిన ఏదో తక్కువైందని కొందరు బాధపడుతూ.. భగవంతుని నిందిస్తూ ఉంటారు. జీవితంలో వ‌చ్చిన సక్సెస్ మాత్రం తమ కష్టం వల్లే సాధ్యమైందని షీల్అవుతారు. లేదంటే ఎవరి క‌న్నో తమపై పడి ఇలా నాశనం అయిపోతున్నామంటూ భావిస్తూ ఉంటారు. ఇలాంటి వారు మన చుట్టూ కోకోల‌లుగా కనిపిస్తూ ఉంటారు. ఇక ఏదో ఒక లోపంతో పుట్టిన వారు మాత్రం అలా తిట్టుకుంటూ కాలక్షేపం చేసే బదులు జీవితంపై ఫోకస్ చేస్తారు. కష్టాలను అధిగమిస్తూ ముందుకు వెళ్లాలని ప్రయత్నిస్తూ ఉంటారు. తమకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ను సృష్టించుకుంటారు. అలాంటి వారిలో యాక్టర్ అభినయ ఒకటి.

పేరుకు తగ్గట్టుగానే అందంతోపాటు అభినయంలోనూ ఆమెకు పేరు పెట్టడానికి ఉండదు. పుట్టకతోనే చెవిటి, మూగదానిగా పుట్టిన అభినయ దానికి తోడు ప్రోటీన్ లోపం వల్ల మూడేళ్ల వరకు నడవలేకపోయింది. తన మైనస్‌లనే ప్లస్‌గా చేసుకుంది అభినయ. ఎప్పుడు కుంగిపోకుండా మాట్లాడలేకపోయినా ఏం వినపడకపోయినా ఎదుటివారి కదలికను బట్టి వారు ఏం మాట్లాడుతున్నారో పసిగటగ‌ల‌దు. పాత్రలకు అనుగుణంగా ఎక్స్ప్రెషన్స్‌ని పలికిస్తుంది. నేనింతే సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన అభినయ టాలీవుడ్ బాలీవుడ్‌లోనూ బోలెడన్ని సినిమాల్లో మెప్పించింది.

టాలీవుడ్ లో ఆమె ఎంట్రీ అంతా సులువుగా కాలేదు. నాడోడిగల్ సినిమాకు అభినయ పిక్ చూసిన డైరెక్టర్ సమద్రఖ‌ని ఆమెను వెంటనే ఓకే చేశాడట‌. కానీ ఆమె మూగా,చెవుడు అని తెలియడంతో వద్దని చెప్పి ముంబై నుంచి ఓ హీరోయిన్‌ని తీసుకువచ్చాడు. తమిళ భాష ఏంటో నంటూ చిరాకు పడి చివరకు చేయనని చెప్పేసిందట ఆ హీరోయిన్‌. దీంతో డైరెక్టర్ మాటలు రాకపోయినా అభినయతోనే సినిమా తీయాలని ఫిక్స్ అయ్యాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమా సూపర్ హిట్ అయింది. పదికి పైగా అవార్డులు వచ్చి పడ్డాయి. ఇదే సినిమాను తెలుగులో శంభో శివ శంభోగా రిలీజ్ చేశారు. అభినయ భాషతో సంబంధం లేకుండా ఎన్నో సినిమాల్లో నటించింది. తన కెరీర్‌లో బెస్ట్ హెల్పింగ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో అవార్డులను దక్కించుకుంది. ఇక్కడితో పరిమితం కాకుండా హాలీవుడ్‌లోనూ ఓన్‌ లిటిల్ ఫింగర్ అనే సినిమాలో నటించింది. తన లోపాలను చూసి కుంగిపోకుండా ఆత్మస్ధైర్యంతో ముందుకు సాగుతూ ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచింది. అభినయ ప్రస్తుతం మార్క్ ఆంటోనీ సినిమాలో నటిస్తోంది.