అగ్నిసాక్షిగా ప‌విత్ర‌తో ఏడ‌డుగులు వేసిన న‌రేష్‌.. పెళ్లి వీడియో వైర‌ల్‌!

ప్రముఖ నటులు వీకే నరేష్, పవిత్ర లోకేష్ పెళ్లి పీట‌లెక్కారు. అగ్నిసాక్షిగా ప‌విత్ర‌తో న‌రేష్‌ ఏడ‌డుగులు వేశాడు. కొద్ది రోజుల క్రితం తాము పెళ్లి చేసుకోబోతున్నట్లుగా న్యూఇయర్ సందర్భంగా వీడియోతో అనౌన్స్ చేసిన ఈ జంట.. తాజాగా పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్‌కు దూరంగా ఓ గుడిలో న‌రేష్‌, ప‌విత్ర‌ పెళ్లి చేసుకున్నారు.

ఈ విషయాన్ని నరేష్, పవిత్ర లోకేష్ ట్విట్టర్ వేదికగా కన్ఫామ్ చేశారు. `ఒక పవిత్ర బంధం, రెండు మనసులు, మూడు ముళ్ళు, ఏడు అడుగులు.. మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు మీ ప‌విత్ర‌న‌రేష్‌` అంటూ ట్విట్ట‌ర్ ద్వారా త‌మ పెళ్లి వీడియోను పోస్ట్ చేశారు.

అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరి మ్యారేజ్ జరిగినట్లుగా తెలుస్తోంది. ప్ర‌స్తుతం న‌రేష్‌, ప‌విత్ర పెళ్లి వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. కాగా, న‌రేష్ కు ఇది నాల్గువ వివాహం కాగా.. ప‌విత్ర‌కు రెండొవ‌ది. నరేశ్‌ చాలా కాలం నుంచి తన మూడో భార్య రమ్యకు దూరంగా ఉంటున్నారు. ఆ త‌ర్వాత ప‌విత్ర‌తో ఏర్ప‌డ్డ ప‌రిచ‌యం ప్రేమ‌గా మార‌గా.. ఇప్పుడు పెళ్లి వ‌ర‌కు వ‌చ్చింది.

Share post:

Latest