మంచు లక్ష్మి తాజాగా తన ట్విట్టర్ ద్వారా ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోకు `నా రక్తం మరుగుతుంది` అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు మంచు లక్ష్మి అంతగా ఫైర్ అవ్వడానికి కారణం ఉంది. మన దేశంలో ఆడవాళ్లకు రక్షణ లేకుండా పోతుంది. అమ్మ ఒడిలో ఆడుకోవాల్సిన చిన్నారుల నుంచి కాటికి కాలు చాపిన పండు ముసలి వరకు.. మహిళ అయితే చాలు కామంతో కన్నుముసుకుపోయిన కొందరు కీచకులు తాము ఉన్నహోదా.. స్థానం అన్ని మరచి కామాంధులుగా మారుతున్నారు.
తాజాగా మధ్యప్రదేశ్ లో ఒక పోలీస్ ఆడపిల్లను వేధించడం కలకలం రేపింది. రాత్రి వేళ ఒంటరిగా వెళుతున్న యువతిని ఓ పోలీస్ అడ్డగించాడు. ఆమెను నడిరోడ్డుపై తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. కాసేపటి తర్వాత ఆ యువతి సదరు పోలీస్ నుండి తప్పించుకొని వెళ్ళిపోయింది. ఇందంతా దూరం నుంచి కొందరు వీడియో చూసి సోషల్ మీడియాలో పెట్టగా.. అది క్షణాల్లో వైరల్ అయింది.
ఛీ.. ఛీ.. రక్షించాల్సిన పోలీసులే ఇంత దారుణానికి పాల్పడతారా అని నెటిజన్లు సదరు పోలీస్ అధికారిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సదరు పోలీస్ ను కఠిన చర్చలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే వీడియోను మంచు లక్ష్మి సైతం తన ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ నా రక్తం మరిగిపోతుంది అంటూ నిరసన వ్యక్తం చేసింది.
Blood boils https://t.co/StR428okW0
— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) March 9, 2023