కష్ట కాలంలో తారకరత్నకు అండ‌గా ఎన్టీఆర్‌.. త‌మ్ముడి మంచిత‌నాన్ని బ‌య‌ట‌పెట్టిన అన్న‌!

నందమూరి తారకరత్న క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. గుండెపోటుతో ఆసుప‌త్రిలో చేరిన ఆయ‌న దాదాపు 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివ‌ర‌కు శ‌నివారం రాత్రి తుది శ్వాస విడిచారు. తారకరత్న అకాల మరణం చిత్రపరిశ్రమలో విషాదం నింపింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హైదరాబాద్ లోని తారకరత్న నివాసానికి వెళ్లి కన్నీటితో నివాళి అర్పించారు. తారకరత్న పార్థివదేహాన్ని మోకిల నుంచి ఫిల్మ్ ఛాంబర్ కు తరలించారు. ఉదయం 10 గంటల తర్వాత నుంచి అభిమానుల సందర్శనార్థం భౌతికకాయాన్ని ఫిల్మ్ ఛాంబర్ లో ఉంచనున్నారు.

సాయంత్రం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే తారకరత్నకు సంబంధించిన ఎన్నో విష‌యాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. ఇందులో భాగంగానే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, తార‌క‌ర‌త్న అనుబంధం గురించి మాట్లాడుతుకుంటున్నారు. ఎన్టీఆర్ కు పోటీగానే నంద‌మూరి కుటుంబం తార‌క‌ర‌త్నను సినిమాల్లోకి దింపార‌ని ప్రచారం జరిగింది. కానీ అందులో నిజం లేదని, తామంతా ఒకే ఫ్యామిలీ అని తారకరత్న స్ప‌ష్టం చేశారు.

అంతేకాదు, తాను ఈ స్థాయిలో ఉండటానికి కారణం తమ్ముడు ఎన్టీఆర్‌ అని, అత‌డు లేకపోతే తన పరిస్థితి చాలా దారుణంగా ఉండేదని తార‌క‌ర‌త్న త‌మ్ముడి మంచిత‌నాన్ని బ‌య‌టపెట్టాడు. ఇక‌పోతే కష్ట కాలంలో తారకరత్నకు ఎన్టీఆర్ అండ‌గా ఉన్నారట‌. పెద్ద‌ల‌ను ఎదురించి అలేఖ్యా రెడ్డిను పెళ్లి చేసుకోవ‌డంతో నంద‌మూరి ఫ్యామిలీ తార‌క‌ర‌త్న‌కు కొన్నాళ్లు దూరం పెట్టింది. అదే స‌మ‌యంలో వ‌రుస ఫ్లాపుల కార‌ణంగా ఆఫ‌ర్లు లేక తారకరత్న ఆర్థిక ఇబ్బందులు ఫేస్‌ చేశాడట‌. ఆ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్‌.. తార‌క‌ర‌త్న‌కు ఆర్థిక సాయం చేశాడ‌ని ప్రతి నెల నాలుగు లక్షలు పంపించేవారని అప్పట్లో వార్త‌లు వ‌చ్చాయి.

Share post:

Latest