చిన్నారుల కోసం మ‌హేష్‌ మరో ముందడుగు.. తండ్రి ఆశ‌యానికి తోడైన సితార‌!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు రీల్‌లోనే కాదు రియ‌ల్‌గానూ హీరోనే అని అంటుంటారు. అందుకు కార‌ణం ఆయ‌న గొప్ప మ‌న‌సే. ఇప్పటికే ఆయన వెయ్యి మందికి పైగా చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేయించాడు. అలాగే తాను దత్తత తీసుకున్న బుర్రిపాలెం, సిద్దాపురం గ్రామాల్లోని ప్రజలకు విద్యా, వైద్యం వంటి సదుపాయాలు సమకూరుస్తున్నాడు.

మరోవైపు రెయిన్ బో, ఆంధ్రా ఆసుపత్రిలతో కలిసి పసి పిల్లల ప్రాణాలను కాపాడుతున్నారు. ఇలా ఎన్నో సేవా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నారు. తాజాగా చిన్నారుల కోసం మ‌హేష్ మ‌రో ముంద‌డుగు వేశాడు. తన సేవా కార్యక్రమాల కోసం https://www.maheshbabufoundation.org/ పేరుతో ఓ వెబ్ సైట్ ని స్థాపించారు. న్యూ ఇయర్ మొదటి రోజున సితార ఈ వెబ్ సైట్ ని అధికారికంగా లాంచ్ చేసింది. తండ్రి ఆశ‌యానికి తోడైన సీతార త‌న‌వంతు సాయం చేసింది.

`నాన్న చేసే మంచి పనుల్లో నేను భాగం అవ్వాలనుకున్నాను. ఇప్పుడు ఇలా సైట్ లాంచ్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ నెల నా పాకెట్ మనీ మొత్తాన్ని ఈ ఫౌండేషన్ కి ఇస్తున్నాను. మీరు కూడా మీ వంతు సాయం చేయండి. మనందరం కలిసి పిల్లల కోసం మరింత మెరిగైన ప్రపంచాన్ని సృష్టిద్దాం` అంతూ ఈ సంద‌ర్భంగా సితార చెప్పుకొచ్చింది. కాగా, మ‌హేష్ స్థాపించిన ఈ వెబ్ సైట్ ద్వారా డ‌బ్బు డొనేట్ చేయొచ్చు. అదే స‌మ‌యంలో ఎవరికైనా పిల్లలకి హార్ట్ ఆపరేషన్స్ ఉంటే ఈ సైట్ ద్వారా రిక్వెస్ట్ కూడా పెట్టొచ్చు.

https://twitter.com/MBfoundationorg/status/1609575075623350272?s=20&t=LggCAGJGCel6R5SGflhglw