రెబ‌ల్‌స్టార్ కృష్ణంరాజు జీవితంలో ముఖ్య ఘ‌ట్టాలు ఇవే….!

ప్రముఖ నటుడు ‘రెబల్ స్టార్’ కృష్ణంరాజు(83) ఆదివారం తెల్ల‌వారు ఝామున మృతిచెందిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న గ‌త కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ హైదరాబాద్​లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని కుటుంబసభ్యులు తెలిపారు. సోమవారం ఉదయం హైదరాబాద్​లో అంత్యక్రియలు జరుగుతాయి. ఆయ‌న జీవితంలో కొన్ని కీల‌క ఘ‌ట్టాల‌ను ఇక్క‌డ తెలుసుకుందాం.

Krishnam Raju undergoes a Surgery

– ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో 1940 జనవరి 20న కృష్ణంరాజు జ‌న్మించారు.
– ఆయ‌న చదువు పూర్తి కాగానే కొన్నాళ్లు జర్నలిస్టుగా పనిచేశారు.
– 1966లో వచ్చిన ‘చిలకా గోరింక’ చిత్రంతో కృష్ణంరాజు.. వెండితెరకు హీరోగా పరిచయం అయ్యారు.
– కృష్ణంరాజు పాతకాలం నటుడు సీహెచ్​ నారాయణరావు వద్ద శిక్షణ తీసుకున్నారు.
– డొండీ నిర్మాణ సారథ్యంలో.. అవేకళ్లు సినిమాలో విల‌న్ పాత్ర ఆయ‌న‌కు మంచి పేరు తీసుకువ‌చ్చింది.

సినీ నటుడు కృష్ణం రాజు మృతి చెందారు | Tollywood actor Krishnam Raju passed  away– News18 Telugu

– ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 1977లో అమరదీపం చిత్రానికి, 1984లో బొబ్బిలి బ్రహ్మన్నకు ఆయ‌న నంది అవార్డులు ఇచ్చింది.
– 1986లో తాండ్రపాపారాయుడు చిత్రానికి ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు వ‌చ్చింది.
– 2006లో ఫిల్మ్‌ఫేర్‌ దక్షిణాది జీవితసాఫల్య పురస్కారాన్ని తీసుకున్నారు.
– రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ఆయ‌న 1991లో న‌ర‌సాపురం నుంచి కాంగ్రెస్ త‌ర‌పున లోక్‌స‌భ‌కు పోటీ చేసి ఓడిపోయారు.

PM Modi Shocks Krishnam Raju | cinejosh.com

– 1996 లోక్‌స‌భ మ‌ధ్యంత‌ర ఎన్నిక‌ల్లో కాకినాడ నుంచి బీజేపీ ఎంపీగా గెలిచారు.
– 1999 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో న‌ర‌సాపురం ఎంపీగా గెలిచి వాజ్‌పేయ్ ప్ర‌భుత్వంలో కేంద్ర స‌హాయ మంత్రిగా ప‌నిచేశారు.
– 2004 ఎన్నిక‌ల్లో బీజేపీ నుంచి న‌ర‌సాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.
– 2009లో ప్ర‌జారాజ్యం నుంచి రాజ‌మండ్రి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.

 

Share post:

Latest