స్టార్ హీరోయిన్ అవ్వాలంటే చాల త్యాగాలు చేయాలి. కాస్టింగ్ కౌచ్ గురించి రమ్యకృష్ణ సెన్సేషనల్ కామెంట్స్.

అలనాటి పాపులర్ గ్లామర్ హీరోయిన్ అన్నా,నీలాంబరి అన్నా,రాజమాత శివగామి అన్నా అందరికి వెంటనే గుర్తొచ్చే పేరు రమ్యకృష్ణ.రమ్యకృష్ణ మొదట్లో రమ్యకృష్ణ చిన్న చిన్న పాత్రల్లో చేసి,భలేమిత్రులు సినిమా తో హీరోయిన్ అయింది.తర్వాత కొన్ని సినిమాల్లో నటించిన కూడా హీరోయిన్ గ గుర్తింపు తెచ్చుకుంది మాత్రం రాఘవేంద్ర రావు గారి అల్లుడుగారు సినిమా తోనే..ఈ సినిమా తర్వాత రమ్య హీరోయిన్ గ బాగా ఎదిగిపోయింది.

గ్లామర్ రోల్స్ కి మాత్రమే పరిమితం అవకుండా,నటనకు ప్రాధాన్యం వున్న పాత్రలు చేయటం ద్వారా అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరయింది.హీరోయిన్ గ ఒక వెలుగు వెలిగిన తర్వాత డైరెక్టర్ కృష్ణవంశీ ని ప్రేమించి పెళ్లాడింది.వీరికి ఒక బాబు కూడా వున్నాడు.సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి అత్త,తల్లి పాత్రలతో కూడా మెప్పించిన రమ్యకృష్ణ కి బాహుబలి లోని శివగామి పాత్ర చాల పేరు తెచ్చింది.శివగామి అంటే రమ్యకృష్ణ అనేంతలా పేరు తెచ్చింది ఈ పాత్ర.

ఇప్పటికే చాలమంది హీరోయిన్స్,ఆర్టిస్ట్స్ ఇండస్ట్రీ లో జరుగుతున్న కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతున్నారు…అయితే ఇటీవల రమ్యకృష్ణ కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు.ఒక అగ్ర హీరోయిన్ ఇలా మాట్లాడటం ఇపుడు పెద్ద సెన్సేషన్ అయింది.రమ్య మాట్లాడుతూ,ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా ఎదగాలంటే చాలా త్యాగాలు చేయాలి,.లైంగిక వేధింపులు కూడా భరించాల్సిందే.ఇక అగ్ర హీరోలు,నిర్మాతలు,డైరెక్టర్స్ చేతిలో నలిగితేనే స్టార్ హీరోయిన్స్ అవుతారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.అయినా కొన్ని పొందాలంటే కొన్ని వదులుకోవాలి..మనం ఇండస్ట్రీ లో నిలబడాలంటే ఎలాంటి త్యాగాలు చేయాలి అనేది మన వ్యక్తిగత విషయం అంటూ రమ్యకృష్ణ లాంటి స్టార్ హీరోయిన్ అనడం ఇపుడు చర్చనీయాంశం గా మారింది.

Share post:

Latest