రాజమౌళి,మహేష్ సినిమా లో హీరోయిన్ గా ఆ బాలీవుడ్ బ్యూటీ..

రాజమౌళి,సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ -మే లో స్టార్ట్ అవబోతుంది.ఈ సినిమ కి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్ రెడీ అయింది ఇంకా జక్కన్న టీం అంత స్క్రిప్ట్ చేసే పనిలో బిజీ గ వుంది అని టాక్.అయితే ఈ సినిమా కి సంబంధించి హీరోయిన్ విషయంలో జక్కన్న,తన టీం అంత బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె ని సంప్రదించాలని ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.అయితే ఫైనల్ స్క్రిప్ట్ అంత రెడీ అయేలోపు రాజమౌళి మైండ్ లో కి ఇంకా ఎంతమంది హీరోయిన్స్ వస్తారో.

అయితే ప్రస్తుతానికి మాత్రం దీపికా నే కన్సిడర్ చేస్తున్నారు.అయితే ఇటీవల రాజమౌళి ఈ సినిమా ఒక గ్లోబెట్రోట్టింగ్ యాక్షన్ అడ్వెంచర్ అని చెప్పారు.ఈ సినిమా స్టోరీ ఆధారంగా ఇది చాల దేశాలు తిరుగుతూ షూటింగ్ జరపాలిసుంటుంది అని చెప్పారు.మహేష్ బాబు కూడా రాజమౌళి సినిమా చేయటం తనకొక “డ్రీం కం ట్రూ”అనిఎప్పటి నుండో ఈ కాంబినేషన్ కోసం తాను కూడా ఎదురుచూస్తున్న అని చెప్పారు.రాజమౌళి ,మహేష్ కాంబినేషన్ కోసం మహేష్ ఫాన్స్ చాల ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా స్టోరీ రాజమౌళి ఫాదర్ విజయేంద్ర ప్రసాద్ గారు రాస్తున్నారు.ఇంకా ఇదొక భారీ బడ్జెట్ సినిమా అని,దాదాపు 550cr బడ్జెట్ అని ఒక సమాచారం.అయితే రాజమౌళి ఇంకా టీం మిగతా క్యారెక్టర్స్ ఫైనల్ చేసేలోపు ఇంకా ఎన్ని మార్పులు వస్తాయో తెలీదు.ఇంకా ఈ సినిమా హీరోయిన్ ప్రస్తుతానికి దీపికా అని ఆలోచన వున్నా,సినిమా సెట్స్ పైకి వెళ్ళేలోపు ఎవరు రాజమౌళి ఆలోచనలోకి వస్తారో చూడాలి మరి.

Share post:

Latest