అప్పట్లోనే రికార్డు రెమ్యూనరేషన్.. ఆ ఘనత సాధించిన ఏకైక టాలీవుడ్ హీరో మన కృష్ణంరాజు..!!

టాలీవుడ్ సీనియర్ నటుడు మాజీ ఎంపీ మాజీ కేంద్రమంత్రి అయిన రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈరోజు ఉదయం హఠాత్ మరణం చెందారు. ఆయన మరణ వార్త విన్న అభిమానులు ఎంతగానో బాధపడుతున్నారు. ఆయన మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా వంటి అగ్ర నాయకులు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు సంతాపం తెలియజేశారు. కృష్ణంరాజు సినిమా ఇండస్ట్రీలో గానీ రాజకీయాలలో గాని వివాదాలకు దూరంగా ఉంటూ వచ్చేవారు. కృష్ణంరాజు ఏ రంగంలో అయినా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు.

Film Actor Krishnam Raju

కృష్ణంరాజు హీరోగా ఎన్నో సినిమాలలో నటించారు. 70- 80 దశ‌కంలో ఆయన తెలుగు చిత్రపరిశ్ర‌మ‌లో అగ్ర హీరోగా కొనసాగారు. ఆ టైంలో ఆయన తీసుకొన్నంత రెమ్యూనరేషన్ ఎవరు తీసుకునేవారే కాదట. ఆ టైంలో ఆ రికార్డును ఎవరు బద్ద‌లు కొట్ట‌లేద‌ని టాక్ కూడా ఉంది. ఆ టైంలో ఆయ‌న‌ ఏకంగా ఒకో సినిమాకి 1,16,000వేలు రూపాయలు తీసుకునే వారట. ఇప్పుడు చూసుకుంటే అమౌంట్ చాలా తక్కువైనా. ఆ టైంలో అది భారీ పారితోషకం కావడం గమనార్హం. కృష్ణంరాజు ఆస్తులు కూడా బానే సంపాదించుకున్నారు. ఆయన ఆస్తులు విలువ సుమారు 800 కోట్ల రూపాయలు దాకా ఉన్నట్టు తెలుస్తుంది.

Baahubali meets Prime Minister Narendra Modi - News Nation English

ఆయనకు చాలా ప్రాంతాల్లో బిల్డింగులు కూడా ఉన్నాయి వాటి విలువ సుమారు 200 కోట్లు పై మాటే అని సమాచారం. సంపాదించిన డబ్బును ఎక్కువ మొత్తం సేవా కార్యక్రమాలకే ఖర్చు చేసే వారట. ఆయన మరణంతో ఆయన కుటుంబ సభ్యులకు తీరని లోటుగా మిగిలిపోయింది. కృష్ణంరాజు కుటుంబ సభ్యులను ఓదార్చటం ఎవరి వల్ల కావడం లేదు. ఎందరో ప్రముఖులు నివాళులర్పిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.