కృష్ణంరాజు మొద‌టి భార్య ఎవ‌రు… ఆ కార‌ణంతోనే చనిపోయిందా…!

తెలుగు సినీ రంగం ఈరోజు శోకసందంలో మునిగిపోయింది. ప్రముఖ సీనియర్ నటుడు కృష్ణంరాజు ఈ రోజు అనారోగ్యంతో తెల్లవారుజామున కన్నుమూశారు. 50 సంవత్సరాల సినీ ప్రస్థానం ని కొనసాగిస్తూ వచ్చారు. ఆయన సినీ ప్రస్థానంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలో నటించి మెప్పించారు. రెబల్ స్టార్ గా తన ఇమేజను పదిలం చేసుకున్నారు. ఆయన నటనతో డైలాగు డెలివరీతో కృష్ణంరాజు ఎంతో మంది అభిమానులను తన సొంతం చేసుకున్నాడు. ఆయన సినిమా రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా తనదైన ముద్ర వేశారు. భారతీయ జనతా పార్టీ తరఫున కాకినాడకు ఎంపీగా గెలుపొందిన కృష్ణంరాజు ఆ తర్వాత గవర్నమెంట్ లో కేంద్రమంత్రిగా కూడాా పనిచేశారు.

ఈ విషయాలన్నీ పక్కన పెడితే కృష్ణంమరాజు జీవితంలో కొన్ని అనుకోని సంఘటనలు కూడా ఉన్నాయి. కృష్ణంరాజు తన వ్యక్తిగత జీవితంలో రెండు పెళ్లిళ్లు చేసుకున్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. కృష్ణంరాజు మొదటి భార్య సీతాదేవి గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఆయన మొదటి భార్య ఎవరు? అయ‌న‌ రెండో పెళ్లి ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? దానికి కారణాలు ఏమిటి…? అనే విషయాలకు ఈ జనరేషన్ వాళ్ళకి తెలియదు.

Telugu Actors Who Married Twice Or More - Page 8 of 10 - Lovely Telugu

కృష్ణంరాజు మొదటగా సీత దేవిని పెళ్లి చేసుకున్నారు. ఈ ఇద్దరికీ ఒక కుమార్తె కూడా జన్మించింది. సీతాదేవి 1995లో ఒక అనుకొని కార్ యాక్సిడెంట్ లో ఆవిడ మరణించింది. ఆ టైంలో కృష్ణంరాజు సీత దేవి మరణాన్ని జీర్ణించుకోలేక కొంతకాలం డిప్రెషన్‌కి లోన‌య్యార‌ట‌. అలా ఉన్న కృష్ణంరాజుని చూసిన బంధువులు అతనికి రెండో పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చారట. మొదట రెండో పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడని కృష్ణంరాజు మెల్లగా తన భవిష్యత్తు గురించి ఆలోచించి శ్యామల దేవిని రెండు వివాహం చేసుకున్నాడు.. శ్యామల దేవికి కృష్ణంరాజుకు ముగ్గురు కుమార్తెలు జన్మించారు. కృష్ణంరాజు విరితో పాటు ఇంకో అమ్మాయిని దత్తు కూడా తీసుకున్నాడు. ఈలా కృష్ణంరాజు తన మొదటి భార్య చనిపోవడంతో అనుకొని కారణాలవల్ల ఆయన రెండు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. కాగా కృష్ణంరాజు మరణం సినీ ఇండస్ట్రీకి తీరని లోటు అని సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు చెప్పుకొస్తున్నారు.

Share post:

Latest