వావ్: మహేష్ కు తెలియకుండా నమ్రత చిలిపి పని..ఎంత బాగుందో..!!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎన్ని జంటలు ఉన్నా.. సూపర్ స్టార్ మహేష్ బాబు ఆయన భార్య నమ్రత అంటే ఇండస్ట్రీలో అందరికీ అదో తెలియని గౌరవం. వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారనే సంగతి తెలిసిందే. అయినా కానీ వీరుచాలా హ్యాపీగా చాలా కూల్ గా ..చాలా రొమాంటిక్ గా కలిసి ఉంటారు. సినీ ఇండస్ట్రీలో మహేష్ బాబు నమ్రతలను చూసి కుళ్ళుకునే జంటలు చాలామందే ఉన్నారు. వీళ్ళని ఆదర్శంగా తీసుకుంటే ఈ డీవర్స్ అన్న పదానికి అస్సలు ఇండస్ట్రీలో తావే ఉండదు అని కచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ..మహేష్ బాబు నమ్రతల దాంపత్య జీవితం ఎంతో అన్యోన్యంగా ఉంటుంది.

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ఎంత స్టేటస్ కలిగిన వ్యక్తో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయినా కానీ ఆయనకు ఒక్కరోజు తీరిక దొరికినా.. ఆ టైం మొత్తం ఫ్యామిలీకే కేటాయిస్తారు. భార్య నమ్రత.. పిల్లలు గౌతం.. సితారతో కలిసి స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు . అందుకే ఈ ఫ్యామిలీ చాలా ముచ్చటగా చూడు చక్కగా ఉంటుంది. రీసెంట్ గానే స్విట్జర్లాండ్ టూర్ వెళ్లిన మహేష్ బాబు ఫ్యామిలీ దానికి సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఆ ఫోటోలు చాలా వైరల్ అయ్యాయి.

కాగా రీసెంట్గా మహేష్ బాబు భార్య నమ్రత స్విట్జర్లాండ్ టూర్ లోని మరికొన్ని ఫోటోలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది . ఈ ఫోటోలలో ఓ ఫోటో మాత్రం అభిమానులను బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఆ ఫోటో తీసిన పద్ధతి చూస్తుంటే ఆ పిక్ తీస్తున్నట్టు మహేష్ బాబుకు తెలియదు. ఈ పిక్ లో మహేష్ బాబు సితార ఏదో సరదాగా మాట్లాడుకుంటున్నట్లు .. గౌతమ్ వాళ్ళ అమ్మని చూస్తున్నట్లు తెలుస్తుంది. దీని ఆధారంగా మహేష్ బాబుకు నమ్రత అక్కడ నిల్చోని ఫోటో తీస్తుందని తెలియదు. హడావిడిగా ఫోటో తీసిన చూడడానికి మాత్రం చాలా చక్కగా చాలా అందంగా బ్యూటిఫుల్ గా ఉంది. ఇదే విషయాన్ని సూపర్ స్టార్ అభిమానులు నమ్రతాకు చెబుతున్నారు.

మీ ఫ్యామిలీ ఎప్పుడు ఇలాగే హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం మేడమ్..” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఇక మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే ఆయన ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు తో #SSMB28 28 అనే సినిమా షూటింగ్ ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళితో ఓ బ్లాక్ పోస్టర్ ప్రాజెక్టు తెరపైకి తీసుకురాబోతున్నారు. ఈ సినిమా మొదలవ్వకుండానే అభిమానులు భారీ స్దాయిలో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

Share post:

Latest