Coffee With Karan: కరణ్ ఖాతాలో కోట్లు..సమంత విడాకుల లాభం ఎంతంటే..?

కరణ్ జోహర్..పక్కా కమర్షీయల్ ..ఇప్పుడు ఇదే హ్యాష్ ట్యాగ్ నెట్టింట ట్రెండింగ్ గా మారింది. మొన్నటి వరకు కూడా కరణ్ జోహర్ డబ్బు మనిషి అని..అవసరానికి తగ్గట్లు మనుషులను వాడుకుని వదిలేస్తారని బాలీవుడ్ లో ఓ టాక్ ఉంది. అయితే, రీసెంట్ గా కాఫీ విత్ కరణ్ షో లో సమంత ని తన విడాకుల గురించి ప్రశ్నించి..ఉన్న పరువు పొగొట్టుకున్నాడు. ఓ ఆడపిల్ల జీవితంలోనే సున్నితమైన మ్యాటర్ ని టచ్ చేసి.. ఆమె బాధలో నుండి వచ్చిన మాటలతో..కోట్లు వ్యూయ్స్ సంపాదించుకుని..డబ్బులు రాబట్టుకున్నాడు.

 

మనకు తెలిసిందే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నాగ చైతన్య తో విడాకులు తీసుకుంది. నెలలు గడుస్తున్న మ్యాటర్ హీట్ పుట్టిస్తూనే ఉంది. అసలే ఫైర్ మీద ఉన్న మ్యాటర్ లో కరణ్ ఇంకొంచెం నిప్పు పెట్టారు..అది భగ్గుమంది. కోపంగా ఉన్న సమంత దగ్గరకు వెళ్లి ఏ మ్యాటర్ అడగకూడదో అదే అడిగేసాడు..బర్స్ట్ అయిన సామ్..ఫ్లాలో టంగ్ స్లిప్ అయ్యి..మొగుడు పెళ్లాల మ్యాటర్ మొత్తం చెప్పేసింది. దీంతో సమంత మాటలు హాట్ టాపిక్ గా మారాయి. విడాకుల తరువాత ఫస్ట్ టైం సమంత నాగచైతన్య గురించి మాట్లాడటంతో వీడియో పై జనాలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూయించారు.

ఈ రోజుల్లో జనాలకి మన ఇంట్లో ఏం జరుగుతుందో అని తెలుసుకోవడం కన్నా..పక్కింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడమే ఇష్టం..అందుకే సమంత విడాకుల వీడియోకి వ్యూయ్స్ ఎక్కువ వచ్చాయి. డిస్ని+ హాట్ స్టార్ లో స్టీమింగ్ అవుతున్న ఈ వీడియో ఏకంగా 11.6 మిలియన్ల వ్యూయ్స్ అందుకుంది. దీని బట్టి చూస్తే కరణ్ కి సమంత విడాకుల లాభం బాగానే వచ్చిన్నట్లు అర్ధమవుతుంది. ఒక విధంగా కరణ్ జోహార్ తన టాక్ షోకు సమంత విడాకుల విషయాన్నీ బాగానే వాడుకున్నట్లు అర్థమవుతుంది.

దీంతో కరణ్ పై కొందరు అభిమానులు ఫై అవుతున్నారు. ఆడదాని కన్నీటి తో సంపాదించిన డబ్బు ఎప్పటికి శాస్వతం కాదు అంటూ తిట్టిపోస్తున్నారు. కాగా, ఈ షోలో సమంత నాగచైతన్య ను ఏకిపారేసింది. భర్త అని పిలిపించుకోవడానికి కూడా ఇష్టపడలేదు. ఒక్కే గదిలో ఉండాల్సి వస్తే పదునైన వస్తువులను కూడా ఇవ్వండి అంటూ నాగచైతన్య పై ఉండే కోపాని పరోక్షంగా బయటపెట్టింది. ప్రస్తుతం సమంత వరుస సినిమాలతో బిజీ గా ఉంది. ఇప్పటికే బాలీవుడ్ లో మూడు బడా ప్రాజెక్ట్స్ కు కమిట్ అయ్యిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..త్వరలోనే దీని పై అఫిషీయల్ ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.