బాబు ప్లాన్ బాబుకే దెబ్బేసింది

ఏపీ సీఎం చంద్ర‌బాబు పార్టీ ప‌టిష్ట‌త కోసం వేసిన ఓ ప్లాన్ రివ‌ర్స్ గేర్‌లో తిరిగి బాబుకే పెద్ద దెబ్బ వేసింది. త‌న ప్లాన్ త‌న‌కే రివ‌ర్స్‌లో తిరిగి రావ‌డంతో చంద్ర‌బాబు ఏం చేయాలో తెలియ‌క త‌ల‌లు ప‌ట్టుకుంటున్నాడు. ఏపీలో గ‌త యేడాది కాలంగా చంద్ర‌బాబు విప‌క్ష వైసీపీ నుంచి త‌న పార్టీలోకి భారీ ఎత్తున ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హిస్తున్నారు. ఈ ఫిరాయింపుల ఎఫెక్ట్‌తో మొత్తం 21 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ చేసేశారు. వీరిలో ముగ్గురు ఎమ్మెల్యేల‌కు […]

ఒకే ఒక్క ప్ర‌శ్న‌కు షాక్ తిన్న లోకేశ్‌

ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు, ఏపీ పంచాయతీరాజ్ శాఖమంత్రి నారా లోకేశ్‌కు ఓ సాధార‌ణ కార్య‌క‌ర్త చేతిలో అదిరిపోయే షాక్ త‌గిలింది. పంచాయ‌తీ రాజ్ 40వ వార్షికోత్స‌వ స‌మావేశాన్ని విజ‌య‌వాడ‌లో నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో ఓ సాధార‌ణ కార్య‌క‌ర్త వేసిన ప్ర‌శ్న‌కు లోకేశ్ స‌మాధానం చెప్ప‌లేక మ‌రోసారి త‌డ‌బాటుకు గుర‌య్యాడు. ఇప్ప‌టికే మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన‌ప్ప‌టి నుంచి చాలాసార్లు త‌డ‌బాటుకు గుర‌వుతోన్న లోకేశ్ ఈ సారి కార్య‌క‌ర్త ప్ర‌శ్న‌కే డంగైపోయారు. గొమ్ములూరుకు చెందిన […]

క‌ర‌ణం వ‌ర్సెస్ గొట్టిపాటి పోరుపై బాబు సీరియ‌స్‌

ప్ర‌కాశం జిల్లాలో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వికుమార్‌, ఎమ్మెల్సీ క‌ర‌ణం బ‌ల‌రాం మ‌ధ్య కొద్ది రోజులుగా ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే తాజాగా బ‌ల్లికుర‌వ మండ‌లం వేమ‌వ‌రంలో క‌ర‌ణం వ‌ర్గానికి చెందిన ఇద్ద‌రు కార్య‌క‌ర్త‌లు దారుణ హ‌త్య‌కు గుర‌వ్వ‌డంతో వీరిద్ద‌రి మ‌ధ్య వార్ తారాస్థాయికి చేరుకుంది. గొట్టిపాటి వ‌ర్గీయులు జ‌రిపిన దాడిలోనే త‌మ వ‌ర్గీయులు హ‌త్య‌కు గుర‌య్యార‌ని క‌ర‌ణం బ‌ల‌రాం మండిప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే మంగ‌ళ‌వారం ఒంగోలులో జ‌రిగిన ప్ర‌కాశం […]

తెలంగాణ‌లో రాజుకున్న రాజ‌కీయం

కోయిల ముందే కూసింది అన్న‌ట్టుగా.. 2019 ఎన్నిక‌ల‌కు ఇంకా రెండేళ్ల టైం ఉండ‌గానే తెలంగాణ‌లో పాలిటిక్స్ హీటెక్కాయి. ముఖ్యంగా జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు వ్యూహాత్మ‌కంగా అప్పుడే అడుగులు క‌దుపుతున్నాయి. ఎట్టి ప‌రిస్థితిలోనూ 2019లో తెలంగాణ‌లో పాగా వేయాల‌ని కాంగ్రెస్, బీజేపీలు ప‌క్కా ప్లాన్‌ను సిద్ధం చేసిన‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు వివిధ రూపాల్లో టీఆర్ ఎస్ ప్ర‌భుత్వంపై యుద్ధం చేసిన ఈ రెండు పార్టీలు ఇక నుంచి ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలిసింది. దీంతో తెలంగాణ‌లో […]

ఒక్క ప్రాబ్ల‌మ్‌తో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల విల‌విల‌

టీడీపీకి కంచుకోట‌లాంటి జిల్లాలో ఇప్పుడు ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో తీవ్ర గ‌డ్డు ప‌రిస్థితులు ఎదుర్కొంటున్నారు. చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల‌పై తీవ్ర వ్య‌తిరేక‌త ఉండ‌గా ఒకే ఒక్క స‌మ‌స్య ముగ్గురు ఎమ్మెల్యేల గెలుపోట‌ముల‌ను శాసించే శ‌క్తిగా మారింది. ఈ స‌మ‌స్య దెబ్బ‌తో ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు విల‌విల్లాడుతున్నారు. ఏపీలో అధికార టీడీపీకి కంచుకోట లాంటి జిల్లాల్లో ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఒక‌టి. ఈ జిల్లాలో భీమ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలోని తుందుర్రు వ‌ద్ద నిర్మిస్తోన్న మెగా […]

కేశినేని వ్యాఖ్య‌ల మంట‌.. బీజేపీ-బాబు మ‌ధ్య తంటా!

విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని ఇటీవ‌ల ఓ కార్య‌క్ర‌మంలో చేసిన వ్యాఖ్య‌లు రాష్ట్రంలో రాజ‌కీయ దుమారాన్నే సృషించాయి. 2014లో బీజేపీతో తాము పొత్తు పెట్టుకోవ‌డం వ‌ల్లే త‌న‌కు మెజారిటీ త‌గ్గింద‌ని ఆయ‌న అన్నారు. 2019లో ఒంట‌రిగా ఎన్నిక‌ల బ‌రిలో నిలిచి ల‌క్ష పైగా మెజారిటీ సాధిస్తామ‌ని ఆయ‌న చెప్పారు. ఈ వ్యాఖ్య‌లే ఇప్పుడు బీజేపీ, టీడీపీల మ‌ధ్య అంతులేని అగాధాన్ని సృష్టించాయి. కేశినేని వ్యాఖ్య‌ల‌పై గుంటూరుకు చెందిన బీజేపీ నేత‌, మాజీ మంత్రి క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ […]

గ్రూప్ రాజకీయాల దెబ్బ… కిష‌న్‌రెడ్డికి అమిత్ షా క్లాస్

తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ దూకుడును నిలువ‌రించేందుకు ప్ర‌తిప‌క్షాలు నానా చెమ‌ట‌లు కక్కుతున్నాయి. తెలంగాణ‌లో సొంతంగా ఎద‌గ‌డంతో పాటు వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తోన్న బీజేపీలో స‌మ‌ష్టిత‌త్వం పూర్తిగా కొర‌వ‌డింది. తెలంగాణ బీజేపీకి బ‌లం త‌క్కువ, నాయ‌కులు ఎక్కువ అన్న చందంగా ఉంది. పార్టీకి ఉన్న ఐదుగురు ఎమ్మెల్యేల మ‌ధ్య కూడా స‌రైన స‌ఖ్య‌త లేదు. కిష‌న్‌రెడ్డి ఓ వ‌ర్గం, పార్టీ శాస‌న‌స‌భాప‌క్ష నేత ల‌క్ష్మ‌ణ్ మ‌రో వ‌ర్గం, ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే చింత‌ల రామచంద్రారెడ్డి మ‌రో […]

గెలుపే ధ్యేయంగా టీడీపీ బరిలోకి

వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌ల‌కు మ‌రో రెండేళ్ల టైం మిగిలి ఉంది. ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చేందుకు చంద్ర‌బాబు చాప‌కింద నీరులా ప్లాన్లు వేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే 13 జిల్లాల‌కు టీడీపీ టీంను ఆయ‌న రెడీ చేసేశారు. ప్ర‌స్తుతం టీడీపీలో జ‌రుగుతున్న జిల్లా, న‌గ‌ర పార్టీ అధ్య‌క్షుల ఎంపిక ప్ర‌క్రియ పూర్త‌య్యింది. ఒక్క విజ‌య‌న‌గ‌రం జిల్లా అధ్య‌క్షుడి ఎంపిక మాత్రం పెండింగ్‌లో ఉండ‌గా… మిగిలిన అన్ని జిల్లాలు, న‌గ‌ర పార్టీ అధ్య‌క్షుల ఎంపిక పూర్త‌య్యింది. […]

బీజేపీలోకి టీడీపీ ఎమ్మెల్యే..!

తెలంగాణ‌లో టీడీపీకి మ‌రో షాక్ త‌గ‌ల‌నుంది. ఇప్ప‌టికే ఒక్క‌రొక్క‌రుగా టీడీపీ నుంచి టీఆర్ ఎస్‌లోకి జంప్ చేసిన నేత‌లు బాబు వ్యూహానికి తూట్లు పొడిచారు. ఇక‌, ఇప్పుడు తాజాగా ఏరికోరి 2014లో ఎల్‌బీ న‌గ‌ర్ టికెట్ ఇచ్చి గెలిపించుకున్న బీసీ సంఘం జాతీయ అధ్య‌క్షుడు ఆర్‌.కృష్ణ‌య్య కూడా చంద్ర‌బాబుకి బై చెప్పేస్తున్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే బాబు, కృష్ణ‌య్య‌ల మ‌ధ్య దూరం నానాటికీ పెరిగింది. మొన్నామ‌ధ్య ఓ ప్ర‌భుత్వ ప‌రీక్ష విష‌యం విద్యార్థుల ప‌క్షాన నిల‌బ‌డిన కృష్ణ‌య్య‌.. […]