12 మంది ఎమ్మెల్యేల‌కు బాబు స్ట్రాంగ్ వార్నింగ్‌

ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుకు కోపం వ‌స్తే అటు ప‌క్క‌న ఎలాంటి వారున్నా ఆయ‌న ఆగ్ర‌హానికి గురికాక త‌ప్ప‌దు. తాజాగా ఏపీలో న‌వ‌నిర్మాణ దీక్ష‌ను ప్రారంభించాల‌ని చంద్ర‌బాబు పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే. అయితే ఈ దీక్ష‌కు 12 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు డుమ్మా కొట్టారు. తాను ఎంతో సీరియ‌స్‌గా ఈ దీక్ష‌లో అంద‌రు ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గోవాల‌ని పిలుపునిస్తే కొంత‌మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు త‌న మాట ప‌ట్టించుకోక‌పోవ‌డంతో చంద్ర‌బాబు సీరియ‌స్ అయ్యారు. అమ‌రావ‌తిలోని త‌న […]

తెలంగాణ భూ కుంభ‌కోణంలో కేసీఆర్ మంత్రి

తెలంగాణ‌లో భూ అక్ర‌మార్కులు చెల‌రేగార‌ని, సబ్ రిజిస్ట్రార్‌లు అవినీతిలో ఆరితేరిపోయి.. అడ్డ‌గోలుగా స‌హాయం చేశార‌ని వార్త‌లు అందాయి. ఈ వ్య‌వ‌హారంలో టీ మంత్రుల హ‌స్తం కూడా ఉంద‌నే వార్త‌లు వ‌చ్చాయి. దీంతో తీవ్రంగా ఫైరైన సీఎం కేసీఆర్‌.. వెంట‌నే ఏసీబీని రంగంలోకి దింపారు. అస‌లు విష‌యం ఏంటో అంతు తేల్చాల‌ని ఆదేశించారు. దీంతో ఇప్ప‌టికే రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల‌పై దాడులు చేశారు. అధికారులు భారీ ఎత్తున ఆస్తులు కూడ‌బెట్టార‌ని, అవినీతిలో పేట్రేగిపోయార‌ని […]

వాళ్లను వదలేసి తప్పుచేశాం… టీ-బీజేపీలో అంతర్మధనం

తెలంగాణలో బీజేపీకి ఐదుగురంటే ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఆ పార్టీలోకి ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వాళ్లెవరు చేరలేదు. అయితే ఈ విషయంలో తాము ముందుగా మేల్కొని ఉంటే… టీఆర్ఎస్ చేరిన టీడీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీలోనే చేరి ఉండేవాళ్లని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారట. తెలుగు రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులు చాలా కామనైపోయాయని… కానీ ఈ విషయంలో తాము చాలా ఆలస్యంగా మేల్కొన్నామని టీ బీజేపీ నేతలు భావిస్తున్నారు. కేసీఆర్ కంటే ముందుగానే టీడీపీకి చెందిన […]

తెలంగాణ మీడియాలో టీడీపీకి ఇంపార్టెన్స్ లేదా..!

తెలంగాణ‌లో టీడీపీ ప‌రిస్థితి మ‌రింత దారుణంగా త‌యారైంది. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాక‌పోయినా.. కేసీఆర్ ప్ర‌భుత్వంపై ఒంటి కాలిపై లేస్తున్న రేవంత్ రెడ్డి.. గ‌త కొన్నాళ్లుగా మ‌రింత దూకుడుగా ఉన్నాడు. కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు వాడి వేడిని మ‌రింత పెంచారు. ఇటీవ‌ల ముగిసిన మ‌హానాడు త‌ర్వాత ఈ వాడి మ‌రింత పెరిగింది. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఇప్ప‌డు ప్ర‌ధాన స‌మ‌స్య‌.. టీడీపీకి మీడియా క‌వ‌రేజ్ ఘోరంగా త‌గ్గిపోయింద‌ట‌! తమ ప‌క్షానే ఉంటాయ‌ని భావించిన ఆ రెండు ప‌త్రిక‌లు […]

విశాఖ‌పై బీజేపీ క‌న్ను! 

విశాఖ‌.. ఏపీలోని అత్యంత సుంద‌ర‌మైన టూరిస్ట్ ప్లేస్‌. అంతేకాదు… కేంద్ర ప్ర‌భుత్వానికి చెందిన అనేక పెద్ద పెద్ద ఇండ‌స్ట్రీలు ఇక్క‌డే ఉన్నాయి. అంతేకాకుండా విశాఖ విమానాశ్ర‌యాన్ని అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంగా, న‌గ‌రాన్ని ప్ర‌ఖ్యాత టూరిస్ట్ ప్లేస్‌గా తీర్చి దిద్దుతున్నారు. దీంతో ఇప్పుడు క‌మ‌ల ద‌ళాధిప‌తుల‌కు ఉక్కు న‌గ‌రంపై మిక్కిలి ప్రేమ ఒలికిపోతోంది! త‌మ‌కు ఏపీలో అత్యంత క‌లిసొచ్చే న‌గ‌రం ఏదైనా ఉంటుందంటే అది విశాఖే న‌ని వాళ్లు చెప్పుకొంటున్నారంట‌! ఈ నేప‌థ్యంలో మొన్న తెలుగు రాష్ట్రాల ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన […]

బీజేపీలోకి కేసీఆర్ డాట‌ర్‌

ఎలాగైనా స‌రే.. తెలంగాణ‌లో పాగా వేయాల‌ని స‌ర్వ విధాలా ప్ర‌య‌త్నిస్తున్న బీజేపీ.. ఇప్పుడు ఆ దిశ‌గా అడుగులు వేసింది. అంతేకాదు, తెలంగాణ అంటే తానేన‌ని, తానంటే.. తెలంగాణ అని.. చెప్పుకొచ్చే సీఎం కేసీఆర్‌కే నేరుగా ఝ‌ల‌క్ ఇచ్చేందుకు రెడీ అయింది. నిజానికి మొన్న తెలంగాణకు వ‌చ్చిన బీజేపీ సార‌థి.. అమిత్‌షా.. కేసీఆర్ సెంట్రిక్‌గా పెద్ద ఎత్తున దుమారం రేపారు. కేంద్రం అనేక ప‌థ‌కాలు ప్రారంభిస్తుంటే.. కేసీఆర్ ఒక్క‌టి కూడా అంది పుచ్చుకోవ‌డం లేద‌ని విమ‌ర్శించారు. అదే స‌మ‌యంలో […]

బాబూ… ఏపీ క‌ష్టాల్లో ఉన్నా.. ఇన్ని క్యాంప్ ఆఫీస్‌లా? 

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఎప్పుడు ఎక్క‌డ స‌భ‌లో మాట్లాడాల్సి వ‌చ్చినా.. తాను సీఎంగా ఉన్న రాష్ట్రం ఎన్నో క‌ష్టాల్లో ఉంద‌ని, ఎన్నో న‌ష్టాలు చ‌విచూస్తున్నామ‌ని చెప్పుకొస్తారు. లోటు బ‌డ్జెట్‌తో ఆర్థిక ప‌రిస్థితి అంతంత మాత్రంగా ఉంద‌ని, అయినా .. తాను కాబ‌ట్టి రాష్ట్రాన్ని లైన్‌లో పెడుతున్నాన‌ని పెద్ద పెద్ద డైలాగులు చెబుతారు. వ‌చ్చిన వాళ్ల‌ని పూర్తిగా త‌న వైపున‌కు తిప్పుకొని.. రాష్ట్రం ప‌ట్ల జాలి ప‌డేలా కూడా చేస్తారు. బాబు మాట‌లు.. నిజ‌మేన‌ని అంద‌రూ అనుకుంటారు. దీనికి […]

తెలంగాణ‌లో ఆ రెండు పార్టీల పొత్తు లేన‌ట్టే..

తెలంగాణ‌లో టీడీపీ బ‌లం గురించి మాట్లాడుకోవ‌డం టైం వేస్ట్ అవుతుంద‌న్న లెక్క‌కు రాజ‌కీయ ప‌రిశీల‌కులు, మేథావులు వ‌చ్చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో టీడీపీ ఒక్క సీటు అయినా గెలుచుకుంటుందా ? అంటే డౌటే అంటున్నారు. టీడీపీ ఫైర్‌బ్రాండ్ రేవంత్‌రెడ్డి లాంటి వాళ్లే వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెల‌వాలంటే సిట్టింగ్ సీటు కొడంగ‌ల్ వ‌దులుకుని క‌ల్వ‌కుర్తి నుంచి పోటీ చేసే అంశంపై ఆలోచ‌న‌లు చేస్తున్నారు. దీనిని బ‌ట్టి అక్క‌డ టీడీపీ ప‌రిస్థితి ఎంత దిగ‌జారిందో అర్థ‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలోనే కేసీఆర్‌తో […]

రాహుల్‌ను కేసీఆర్ లైట్ తీసుకుంటున్నారా.. ?

తెలంగాణ మూడో ఆవిర్భావ దినోత్సవానికి ఒక్క రోజు ముందు తెలంగాణకు వచ్చి కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన వెళ్లారు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. సంగారెడ్డిలో నిర్వహించిన రాహుల్ గాంధీ సభ సూపర్ సక్సెస్ అయ్యిందని కాంగ్రెస్ శ్రేణులు కూడా సంబరాలు చేసుకుంటున్నాయి. ఇదంతా ఎలా ఉన్నా… కాంగ్రెస్ విమర్శలను టీఆర్ఎస్ పెద్దగా పట్టించుకునే అవకాశం లేదని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. రాహుల్ చేసిన విమర్శలకు కేటీఆర్, హరీశ్, కవిత వంటి వాళ్లు మాత్రమే స్పందిస్తారని తెలుస్తోంది. […]