నభా నటేష్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఇస్మార్ట్ శంకర్ మూవీతో భారీ క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ.. ప్రస్తుతం క్రేజీ ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతోంది. నితిన్ హీరోగా తెరకెక్కిన మాస్ట్రో చిత్రంలో నభానే హీరోయిన్‌గా నటించింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఇప్పుడు ఈ భామ బాలీవుడ్ స్టార్ హీరోతో రొమాన్స్ చేసే అవకాశాన్ని అందుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు..హృతిక్ రోషన్. […]
Category: gossips
భారీ ధర పలికిన పవన్-రానా మూవీ డబ్బింగ్ రైట్స్?!
సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న తాజా మల్టీస్టారర్ `అయ్యప్పనుం కోషియం` రీమేక్. సితార ఎంటర్‌టైనెమెంట్స్ బ్యానర్ పై సూర్య దేవరనాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ మరియు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో పవన్‌కు జోడీగా నిత్యా మీనన్ నటిస్తోంది. ఇక కరోనా సెకెండ్ వేవ్ తర్వాత ఇటీవలె ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లగా.. ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా […]
మరో డైరెక్టర్‌కు ఓకే చెప్పిన చిరు..నెట్టింట పోస్ట్ వైరల్!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో లూసిఫర్ రిమేక్, మెహర్ రమేష్ దర్శకత్వంతో వేదాళమ్ రీమేక్, బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. ప్రస్తుతం ఈ మూడు చిత్రాలు సెట్స్ మీదకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయి. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం.. చిరు మరో డైరెక్టర్‌కు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. సంపత్ నంది. […]
ఎయిర్ హోస్ట్ గా మారుతున్న టాలీవుడ్ టాప్ యాంకర్!
బుల్లితెరపై హాట్ యాంకర్‌గా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న అనసూయ.. వెండితెరపై కూడా సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ రంగమ్మత్త యంగ్ హీరోల చిత్రాల్లోనే కాకుండా.. స్టార్ హీరోల చిత్రాల్లోనూ కీలక పాత్రలు పోషిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ బ్యూటీ ఎయిర్ హోస్టెస్‌గా మారేందుకు సిద్ధమవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్లే.. `పేపర్ బాయ్` సినిమాకి దర్శకుడిగా వ్యవహరించిన జయశంకర్.. తాజాగా ఓ సరికొత్త కథ రెడీ చేశాడు. […]
“పుష్ప ” తాజా అప్డేట్ …ప్లాన్ వర్కౌట్ అవుతుందా ?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. అలాగే ఈ చిత్రంలో మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్‌గా కనిపించబోతున్నాడు. అయితే ఇక్కడే ఊహించని ట్విస్ట్ ప్లాన్ చేశాడట సక్కూ. లేటెస్ట్ సమాచారం ప్రకారం..పుష్పలో ఫాహద్ కాకుండా మరో నటుడు […]
రష్మికను లైన్‌లో పెట్టిన `జాతిరత్నాలు` డైరెక్టర్?!
లక్కీ బ్యూటీ రష్మిక మందన్నా ప్రస్తుతం తెలుగులోనే కాకుండా.. కన్నడ, హిందీ, తమిళ భాషల్లోనూ నటిస్తూ క్షణం తీరిక లేకుండా గుడుపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ అమ్ముడు మరో సినిమాకు ఒకే చెప్పిందని వార్తలు వస్తున్నాయి. జాతిరత్నాలు సినిమాతో ఫామ్‌లోకి వచ్చిన కేవీ అనుదీప్ తన తదుపరి చిత్రాన్ని తమిళ హీరో శివ కార్తికేయన్‌తో ప్రకటించిన సంగతి తెలిసిందే. శివ కార్తికేయన్‌కు ఇదే తొలి తెలుగు చిత్రం. సీనియర్ నిర్మాతలు నారాయణ్ దాస్ నారంగ్, పీ […]
‘మా’ ఎన్నికలపై క్లారిటీ వచ్చేది అప్పుడేనట?!
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల వ్యవహారం రోజు రోజుకు ఉత్కంఠగా మారుతుంది. మా ఎన్నికలను ఏకగ్రీవం చేయాలనీ కొంతమంది.. ఎన్నికలు పెట్టాలని మరికొంతమంది వాదిస్తున్నారు. అయితే ప్రస్తుత కార్యవర్గం పదవీ కాలం మార్చిలోనే ముగియడంతో ప్రస్తుత కమిటీలో ఉన్న కొందరు తక్షణమే ఎన్నికలు జరిపాలంటూ క్రమశిక్షణా సంఘం కమిటీ అధ్యక్షుడు కృష్ణంరాజుకి లేఖలు రాశారు. ఈ నేపథ్యంలోనే గురువారం కృష్ణంరాజు నేతృత్వంలో ఆన్‌లైన్ ద్వారా ‘మా‘ కార్యవర్గ సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశంలో పాల్గొన్న […]
భర్త కారణంగా డైలమాలో పడ్డ శిల్పాశెట్టి కెరీర్?!
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను పోర్నోగ్రఫీ కేసులో ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రాజ్ కుంద్రా గురించి ఎన్నో సంచలన విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. దాంతో కుంద్రా పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను కూడా ముంబై కోర్టు కొట్టివేసింది. ఇక మరోవైపు భర్త కారణంగా శిల్పాశెట్టి కెరీర్ కూడా డైలమాలో పడింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన శిల్పా ఇటీవలె సెకెండ్ ఇన్నింగ్ స్టార్ చేసి హంగామా […]
ఏంటీ..`ప్రాజెక్ట్ కె`కు ప్రభాస్ అన్ని డేట్స్ ఇచ్చాడా?
రెబల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో ఓ భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తుండగా.. దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోంది. సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో పాన్ వరల్డ్ లెవల్‌లో అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఇటీవలె ఈ చిత్రం ప్రాజెక్ట్ కె వర్కింగ్ టైటిల్‌తో సెట్స్ మీదకు వెళ్లింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ […]









