వామ్మో… ఆ టీడీపీ అభ్యర్థి ఇలాంటి వాడా…!

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలనేది అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ లక్ష్యం. ఇప్పటికే రెండు పార్టీలు తమ తమ అభ్యర్థులను ప్రకటించేశాయి. వైసీపీ అధినేత ముందు నుంచి చెబుతున్నట్లుగానే సుమారు 50 మంది కొత్త వారికి టికెట్లు ఇచ్చారు. అయితే టీడీపీ మాత్రం దాదాపు పాతవారికే టికెట్లు ఇచ్చింది. అదే సమయంలో టీడీపీకి సరైన నాయకత్వం లేని నియోజకవర్గంలో చివరి నిమిషంలో పార్టీలో చేరిన వారికి టికెట్లు ఇచ్చారు చంద్రబాబు. ఇవే […]

టీడీపీ అభ్యర్థులు మారతారా….?

ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. సరిగ్గా నెల రోజుల్లోనే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారం ప్రారంభించేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం పేరుతో యాత్ర చేస్తుండగా… వైసీపీ అధినేత జగన్ మేమంతా సిద్ధం అంటున్నారు. మరోవైపు జనసేన పార్టీ నేత పవన్ కూడా వారాహి యాత్ర చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు… గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. […]

సైలెంట్‌గా ‘ సొంగా రోష‌న్‌ ‘ రాజ‌కీయం… అంతుచిక్క‌ని టెక్నిక్‌…!

పార్టీకి కంచుకోట‌… గ‌త ఎన్నిక‌ల్లో 36 వేల ఓట్ల‌తో పార్టీ ఓట‌మి.. పైగా నాలుగేళ్లుగా నియోజ‌క‌వ‌ర్గానికి ఇన్‌చార్జ్ కూడా లేరు… పార్టీ క్షేత్ర‌స్థాయిలో బ‌లంగానే ఉంది… స‌మ‌ర్థులు, సీనియ‌ర్లు అయిన నాయ‌కులు కూడా ఉన్నారు. అయితే నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌ ఎవ‌రు ? ఎవ‌రు పోటీలో ఉంటారు ? అన్న‌ది తెలియ‌క చింత‌ల‌పూడి కేడ‌ర్‌, పార్టీ వీరాభిమానులు మూడేళ్ల‌గా పైగా అనుభ‌విస్తోన్న ఉత్కంఠ మామూలుగా లేదు. అస‌లే ఎన్నిక‌ల మూడ్ వ‌చ్చేసింది.. అటు వైసీపీ క్యాండెట్ డిసైడ్ అయిపోయాడు… […]

ఏపీ రాజకీయాల్లోకి కొత్త నేతలు రాక…!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే… తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మాటల్లో వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి. మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి సంకేతాలు కూడా అందాయి. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గాలకు ఇంఛార్జులను ప్రకటించేస్తోంది అధికార వైసీపీ. గెలుపుపై పూర్తి ధీమాతో ఉన్న ప్రతిపక్షాలు కూడా రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై కసరత్తు ముమ్మరం చేశాయి. టీడీపీ-జనసేన పొత్తు ఖరారు కావడంతో… రెండు పార్టీల అధినేతలు […]

నెల్లూరు కోటపై బీసీ పాగా….!

ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలోని 10 నియోజకవర్గాల్లో 2 స్థానాలు ఎస్సీ రిజర్వుడు కాగా… మిగిలిన 8 స్థానాలు.. జనరల్ కేటగిరిలో ఉన్నప్పటికీ… టీడీపీ, వైసీపీలు బీసీలకు ప్రాధాన్యత కల్పించలేదు. తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పటి నుంచి సుమారరు 16 ఏళ్ల తర్వాత వెంకటగిరి నియోజకవర్గం నుంచి బీసీలకు అవకాశం కల్పిచింది. అటు కాంగ్రెస్ పార్టీలో కూడా 1972 నుంచి సుమారు 27 ఏళ్ల తర్వాత బీసీలకు (నెల్లూరు అర్బన్ నుంచి అనిల్ కుమార్ యాదవ్) అవకాశం లభించింది. […]

ఏపీలో ఓటర్ల జాబితాలో అక్రమాలు… కారణం…!

ఏపీలో ఓటర్ల జాబితాలో అక్రమాలు ఆగడం లేదు…. రోజుకో అక్రమం బహిర్గతమవుతోంది. బ్రతికున్న వారిని మరణించినట్టు చూపించడం, మరణించిన వారిని జాబితా నుంచి తొలగించకపోవడం… ఇలా ఒకటి కాదు… కావాల్సినన్ని చిత్ర విచిత్రాలు ఓటర్ల జాబితాలో ఉన్నాయి. ప్రతిపక్షాల ఓట్లు తొలగించడంతో పాటు… జీరో డోర్ నెంబర్లలో వందల సంఖ్యలో ఓట్లు కూడా ఉన్నాయి. ఇక దేశంలో ఎక్కడా లేని విధంగా చెట్లకు కూడా ఓటర్ల జాబితాలో చోటు దక్కింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు […]

టీడీపీ – జనసేన మరో అడుగు… ముందుకు పడుతుందా…!?

తెలుగుదేశం, జనసేన మరో అడుగు ముందుకేశాయి. ఈ నెల 9వ తేదీన సమన్వయ కమిటీ భేటీ నిర్వహించి ఉమ్మడి కార్యాచరణ దిశగా అడుగులు వేయాలని నిర్ణయించాయి. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉమ్మడి పోరాటం, ఉమ్మడి మ్యానిఫెస్టో ప్రకటన, క్షేత్రస్థాయిలో సమన్వయంపై ప్రధానంగా దృష్టిసారించాలని నిర్ణయించారు. 9న జరగబోయే సమన్వయ కమిటీ భేటీలో వీటిపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. మధ్యంతర బెయిల్‌పై విడుదలై హైదరాబాద్‌లో విశ్రాంతిలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును, జనసేన అధినేత పవన్‌ […]

ఢిల్లీలో దోస్తీ… గల్లీలో కుస్తీ… ఇదే ట్రెండ్‌…!

నిన్నటి వరకూ ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అన్న చందంగా ఉన్న బీజేపీ, వైసీపీ మధ్య సంబంధాలు.. ఇటీవల నువ్వా, నేనా అన్న రీతిలో మారాయి. వైసిపి నేతలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడాన్ని రాష్ట్ర బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, మద్యం, ఇసుక వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించిన బీజేపీ.., విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని భారత ప్రధాన న్యాయమూర్తికి ఏకంగా లేఖ రాసింది. ఇదిలా […]

సుప్రీం తీర్పుపై టీడీపీ నేతల్లో ఉత్కంఠ..!

చంద్రబాబు కేసులో సుప్రీం కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అవినీతి నిరోధక చట్టంలోని 17 ఏ చంద్రబాబుకు వర్తిస్తుందా లేదా అనే అంశం పై సుప్రీంకోర్టు వెలువరించే నిర్ణయం కోసం ఆంధ్రప్రదేశ్ లో అన్ని రాజకీయపక్షాలు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాయి. చంద్రబాబు పై నమోదు చేసిన కేసులు చెల్లవని, 17 ఏ ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోలేదని చంద్రబాబు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పి దాఖలు చేశారు. దీని పై సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. […]