2019 ఎన్నికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోను హీటెక్కిస్తున్నాయి. ఈ హీట్ తెలంగాణలో కంటే ఏపీలోనే ఎక్కువుగా ఉంది. ఏపీలో వచ్చే ఎన్నికల నాటికి ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మారడం ఖాయంగా కనిపిస్తోంది. నేడు మిత్రపక్షాలుగా ఉన్నవాళ్లు ఎన్నికల వేళ శత్రువులు అవుతారన్న ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. ఇదిలా ఉంటే ఏపీలో బీజేపీ+టీడీపీ పొత్తు బ్రేకప్ అవుతుందన్న వార్తల నేపథ్యంలో బుధవారం ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. […]
Author: admin
ప్రభుత్వం ఆలోచించింది ఒకటైతే.. జరిగిన ప్రచారం మరొకటి
ఒకే ఒక్క వార్త మూడేళ్ల కష్టాన్ని వృథా చేసింది. ఇన్నాళ్లూ జాగ్రత్తగా చూసుకుంటున్న ఉద్యోగులను దూరం చేసేసింది. సీఎం చంద్రబాబు కష్టాన్నంతా బూడిదలో పోసిన పన్నీరు చేసింది. అది వాస్తవమో అవాస్తవమో తెలీదు గాని.. ఉద్యోగుల్లో మాత్రం ప్రభుత్వంపై అభద్రతా భావాన్ని కలిగించేలా చేసింది. `నేను గతంలోలా కఠినంగా వ్యవహరించను. నేను మారాను. నన్ను నమ్మండి` అంటూ 2014 ఎన్నికల సమయంలో ఉద్యోగులకు హామీ ఇచ్చిన చంద్రబాబు.. అలా వ్యవహరిస్తున్నా.. ఒకే ఒక్క కథనంతో మొత్తం సీన్ […]
నంద్యాలలో పవన్ ఎన్ని ఓట్లను ప్రభావితం చేస్తాడు…!
`నంద్యాల ఉప ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశంపై రెండు రోజుల్లో అభిప్రాయాన్ని ప్రకటిస్తా` అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిన నాటి నుంచి అందరిలోనూ ఒకటే చర్చ! పవన్ ఎన్ని ఓట్లు ప్రభావితం చేస్తాడు? ఏఏ వర్గాల ఓట్లను తనవైపు తిప్పుకోగలుగుతాడు? ఎవరికి ఇది ప్లస్? ఎవరికి మైనస్? అనే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. పవన్ నిర్ణయంపై అటు టీడీపీ, వైసీపీతో పాటు జనసేన కార్యకర్తలు కూడా ఉత్కంఠతో […]
బాహుబలి భామ చెంప దెబ్బకు కారణం లేకపోలేదా!
సినిమాలకు పబ్లిసిటీ ఎంతో ముఖ్యం! సరైన పబ్లిసిటీ లేకుంటే ఎంత పెద్ద సినిమా అయినా ఫట్ అనాల్సిందే! అయితే ఇప్పుడు ఈ పబ్లిసిటీ స్టంట్ కోసం.. దర్శక నిర్మాతలు కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నారు. ముందుగానే సెట్స్‌లో నటీనటులతో ఉన్న వీడియోలను విడుదల చేస్తుంటారు. ఇప్పుడు బాలీవుడ్‌లో ఇలాంటి వీడియో క్లిప్ వైరల్‌గా మారింది. బాహుబలి మొదటి భాగంలో `మనోహరీ..` పాటలో అందచందాలు ఆరబోసిన నటి.. స్కార్లెట్ మిలిష్ విల్సన్ తన కో ఆర్టిస్టు చెంప చెళ్లుమనిపించడం.. […]
ఏపీ మంత్రి కేసీఆర్‌కు ప్రశంసలు…ఇంకేముంది
రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత.. తెలంగాణలో టీఆర్ఎస్ ధాటికి తెలుగుదేశం ప్రభుత్వం తీవ్రంగా నష్టపోయింది. దీనిపై అటు తెలంగాణ నేతలు.. సీఎం కేసీఆర్‌పై పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ సమయంలో కేసీఆర్‌ను ప్రశంసిస్తూ ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ నేతలను ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే టీడీపీకి వైసీపీ కంటే తక్కువ ఓట్లు వస్తాయని చెప్పిన కేసీఆర్‌ను పొగడటంపై మండిపడుతున్నారు. ఒకపక్క తెలంగాణలో తామంతా కేసీఆర్ అవినీతి, ఇతర […]
‘ పైసా వసూల్ ‘ ఆడియో ఖమ్మంలోనే ఎందుకు?
యువరత్న నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తోన్న 101వ సినిమా `పైసా వసూల్` ఈ యేడాది సంక్రాంతికి వచ్చిన బాలయ్య 100వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో పాటు బాలయ్య కెరీర్‌లోనే తిరుగులేని హిట్ అయ్యింది. శాతకర్ణి యూఎస్‌లో 1.5 మిలియన్ డాలర్లు రాబట్టడంతో పాటు ఓవరాల్‌గా రూ. 77 కోట్ల గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టింది. ఇక శాతకర్ణి తర్వాత వస్తోన్న సినిమా కావడంతో సహజంగానే పైసా వసూల్‌పై మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే […]
ఏపీ టీడీపీ కొత్త అధ్యక్షుడిగా ఆయనే !
ఏపీలో అధికార టీడీపీ అటు ప్రభుత్వ పరంగాను, ఇటు రాజకీయంగాను అష్టకష్టాలు పడుతోంది. బీజేపీ నుంచి సరైన సహకారం లేకపోవడం, నియోజకవర్గాల పునర్విభజన లేకపోవడం, నిధుల లేమితో ఆశించిన మేర హామీలు నెరవేర్చలేకపోవడం, పార్టీలో ఎప్పుడూ లేనంతగా గ్రూపు రాజకీయాలు పెరిగిపోవడంతో టీడీపీ పరిస్థితి దారుణంగా ఉంది. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని విశ్వప్రయత్నాలు చేస్తోన్న చంద్రబాబు పార్టీ సంస్థాగత కమిటీల పరంగా ఓ కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా […]
షాక్: వైసీపీలోకి 10 మంది టీడీపీ ఎమ్మెల్యేలు…!
ఏపీలో అధికార టీడీపీ ఈ మూడేళ్లలో రాజకీయంగా సాధించింది ఏంటంటే అది ఒకే ఒక్కటి… విపక్ష వైసీపీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకోవడం. చంద్రబాబు అభివృద్ధి ద్వారా బలోపేతం అవ్వాలన్న విషయాన్ని పక్కన పెట్టేసి ఇతర పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుని పార్టీని బలోపేతం చేయాలనే ప్రయత్నానికి తెరదీశారు. వైసీపీని రాజకీయంగా దెబ్బకొట్టేందుకు చంద్రబాబు వేసిన ఈ ఎత్తులు ఇప్పుడు బాబుకే పెద్ద ముప్పు కాబోతున్నాయి. ఏపీ టీడీపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు […]
టీడీపీ మీడియా పిచ్చి ముదిరిందా
ఎక్కడయినా.. ఎప్పుడయినా సమయం, సందర్భం, ఔచిత్యం.. పాటించి ప్రవర్తించాలి. లేకపోతే అభాసుపాలవ్వక తప్పదు. ఇప్పుడ జనసేన అధినేత పవన్ కల్యాణ్, సీఎం చంద్రబాబు భేటీని కూడా తమకు అనుకూలంగా మలుచుకుని.. టీడీపీ అనుకూల మీడియా మరోసారి చర్చనీయాంశమైంది. ఉద్దానంలోని కిడ్నీ బాధితులు పడుతున్న ఇబ్బందులు, వాటిపై అధ్యయనం చేసిన హార్వర్డ్ వర్సిటీ ప్రతినిధులు అందజేసిన నివేదికను చంద్రబాబుకు అంద జేసేందుకు పవన్ వెళ్లారనేది అందరికీ తెలిసిందే! కానీ ఈ విషయాన్ని సైడ్ ట్రాక్ పట్టించి.. రాష్ట్రం గురించి […]
