ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాల ఉపఎన్నిక నేపథ్యంలో జిల్లా రాజకీయాలు గంటకో మలుపు తిరుగుతున్నాయి. అసలు ఏ క్షణానికి అధికార, ప్రతిపక్ష పార్టీల్లో ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేకపోతున్నారు. టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన శిల్పా చక్రపాణిరెడ్డి ఈ రోజు జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్న సంగతి తెలిసిందే. వైసీపీలో చేరేందుకు సిద్ధమైన శిల్పా చక్రపాణి రెడ్డికి వైసీపీ అధినేత జగన్ షాక్ ఇచ్చారు. టీడీపీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తర్వాత వైసీపీలో చేరాలంటూ వైసీపీ […]
Author: admin
‘ జై లవకుశ ‘ వంశీకి చిక్కిందా..!
యంగ్‌టైగర్ ఎన్టీఆర్ జై లవకుశ ప్రి రిలీజ్ బజ్ అదిరిపోతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన జై క్యారెక్టర్ టీజర్ రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తుండడంతో ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. ఇదిలా ఉంటే జై లవకుశ ఓవర్సీస్ రైట్స్‌ను హారిక అండ్ హాసిని బ్యానర్ నిర్మాతల్లో ఒకరు అయిన సూర్యదేవర నాగవంశీ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. జై లవకుశ యూఎస్ రైట్స్ కోసం వారు రూ 10.5 కోట్లు కోట్ చేయగా నిర్మాత […]
గౌతమ్‌నంద వీక్ కలెక్షన్స్ లెక్క ఇదే
టాలీవుడ్‌లో విలన్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన గోపీచంద్ వరుస ప్లాపుల తర్వాత లౌక్యం సినిమాతో సక్సెస్ ట్రాక్‌లోకి ఎక్కాడు. లౌక్యంతో గోపీకి వచ్చిన పేరంతా సౌఖ్యం సినిమాతో పోయింది. సౌఖ్యం తర్వాత చాలా చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్న గోపీ ఒకేసారి మూడు సినిమాల్లో నటించాడు. సీనియర్ డైరెక్టర్ బి.గోపాల్ దర్శకత్వంలో ఆరడగుల బుల్లెట్ పలుసార్లు వాయిదాలు పడి గత నెలలో రిలీజ్ కావాల్సి ఉన్నా వాయిదా పడింది. ఇక ఆక్సిజన్ సినిమాది అదే దారి. ఈ […]
కథ-స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చంద్రబాబు
హెడ్డింగ్ వినడానికి షాకింగ్‌గా అనిపించినా.. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మాత్రం ఇదే జరుగుతోంది. `అక్టోబర్ నుంచి ప్రజాక్షేత్రంలోనే ఉంటా` అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన నాటి నుంచి ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ప్రతిపక్ష నేత జగన్‌ను లక్ష్యంగా చేసుకునే పవన్ దీనిని ప్రకటించాడా? అనే సందేహం కలగకమానదు. `అన్న వస్తున్నాడు` పేరుతో జగన్.. అక్టోబర్ నుంచే పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో పవన్ కూడా రంగంలోకి దిగుతుండటం.. అది కూడా […]
20 రోజులు జగన్ ఫ్యామిలీ అడ్రస్ చేంజ్
కర్నూలు జిల్లా నంద్యాలలో వైసీపీ క్రమక్రమంగా పట్టు బిగిస్తోంది. గత వారం రోజులుగా ఇక్కడ ఎవరో ఒకరు ప్రముక వ్యక్తి వైసీపీలో చేరుతూనే ఉంటున్నారు. మాజీ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ రాకేశ్‌రెడ్డి, టీడీపీ కార్పొరేటర్ హనీఫ్, నిన్న తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి వైసీపీలోకి జంప్ చేసేస్తున్నారు. ఇక్కడ ఎన్నిక 2019 సాధారణ ఎన్నికలకు సెమీఫైనల్‌గా అందరూ భావిస్తుండడంతో జగన్ కూడా ఇక్కడ చావో రేవో తేల్చుకునేందుకు రెడీగానే ఉన్నాడు. ఈ క్రమంలోనే […]
ఆగస్టు నెలంతా సినిమాల పండగే
టాలీవుడ్‌లో ఆగస్టు నెలంతా వరుసగా క్రేజీ ప్రాజెక్టులు రిలీజ్ అవుతున్నాయి. సాధారణంగా ప్రతి నెలలోను ఒకటో రెండో క్రేజీ ప్రాజెక్టులు ఉంటాయి. అయితే ఆగస్టు నెలంతా మంచి అంచనాలు ఉన్న సినిమాలే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ప్రతి వారం ఇక్కడ టఫ్ కాంపిటేషనే ఉంది. ముందుగా ఫస్ట్ శుక్రవారం 4వ తేదీన కృష్ణవంశీ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా నటించిన నక్షత్రం, సుకుమార్ నిర్మాణంలో రూపొందిన దర్శకుడు చిత్రాలు రిలీజ్ కానున్నాయి.ఒకటి క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం […]
నంద్యాలలో టీడీపీ అల్లుడు వర్సెస్ వైసీపీ మామ
ఏపీలో ఇప్పటికే హైటెన్షన్‌గా మారిన కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ట్విస్టులు అదిరిపోతున్నాయి. గత వారం రోజులుగా నలుగురు కీలక వ్యక్తులు ఇతర పార్టీల నుంచి టీడీపీలోకి జంప్ చేయడం, ఇక్కడ ఇటీవల కాలంలోనే సీఎం చంద్రబాబు రెండుసార్లు పర్యటించడం, ఇక ఇక్కడ ప్రచారానికి వైసీపీ అధినేత జగన్, షర్మిల, విజయలక్ష్మితో పాటు టీడీపీ నుంచి బ్రాహ్మణి లాంటి వాళ్లు ప్రచారానికి వస్తుండడంతో ఇప్పటికే ఇక్కడ రాజకీయం అదిరిపోతోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఇక్కడ […]
నితిన్ ‘ లై ‘ ప్రి రిలీజ్ టాక్.. ఎలా ఉందంటే…
అ…ఆ సినిమాతో రూ. 50 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు యంగ్ హీరో నితిన్. అ…ఆ సినిమా తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్న నితిన్ ఇప్పుడు తన అప్ కమింగ్ ప్రాజెక్టు లైతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా నితిన్ కెరీర్‌లోనే అత్యధికంగా రూ. 40 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమాతో తన మార్కెట్ పరిధిని మరింత విస్తృతం చేసుకోనున్నాడు నితిన్. ఈ సినిమాపై చిత్ర యూనిట్ ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నట్టు […]
రక్షణనిధి గ్రాఫ్ ఎలా ఉంది?ప‌్లస్‌లు, మైనస్‌లు ఇవే
కృష్ణా జిల్లాలోని పశ్చిమప్రాంతంలో వెనకపడిన నియోజకవర్గం తిరువూరు. ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం అయిన తిరువూరులో గత మూడుసార్లు టీడీపీ గెలవకపోవడం ప్రత్యేకత. గత ఎన్నికల్లో పామర్రు నియోజకవర్గానికి చెందిన కొక్కిలిగడ్డ రక్షణనిధి తిరువూరు నుంచి పోటీ చేసి 1676 ఓట్ల స్వల్ప మెజార్టీతో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గతంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధిగా పనిచేసిన రక్షణనిధి ఎమ్మెల్యేగా కొన్ని పరిమితులకు లోబడడం వల్ల అనుకున్న స్థాయిలో ప్రోగ్రెస్ చూపించలేకపోతున్నారు. విపక్ష వైసీపీకి చెందిన ఎమ్మెల్యే కావడం, నియోజకవర్గంలో […]
