బాలకృష్ణ – బోయపాటి కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అఖండ 2 అనూహ్యంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఫైనల్ ఇష్యులతో సినిమా ఆగిపోయినప్పటి నుంచి ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమా విషయంలో టీం నుంచి ఏ చిన్న అప్డేట్ బయటకు వచ్చినా.. అభిమానుల్లో ఆసక్తి మొదలైపోతుంది. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ డేట్ రివీల్ చేస్తారా అంటూ ఎదురు చూస్తున్నారు. అయితే.. ఇప్పటికే సమస్యలన్నీ క్లియర్ అయ్యాయని.. వీలైనంత త్వరలో సినిమా రిలీజ్ డేట్ అఫీషియల్ గా ప్రకటించనున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే.. బాలయ్య తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గోపీచంద్ మల్లినేని డైరెక్షన్లో తీసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఎన్బీకే 111 రన్నింగ్ టైటిల్‌తో రూపొందిన ఈ సినిమాపై ఇప్పటికే వరుస అప్డేట్ ఇస్తూ మేకర్స్ ఆడియన్స్‌లో హైప్ పెంచుతున్నారు. ప్రస్తుతం సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయి. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రానుందని సమాచారం. ఈ క్రమంలోనే సినిమాపై చిన్న చిన్న అప్డేట్స్ను రివిల్ చేస్తూన్నాడు గోపీచంద్. ఇక.. ఈ సినిమాలో బాలయ్య సరసన నయనతార హీరోయిన్గా మెరవనుంది. ఈ క్రమంలోనే థమన్ సినిమాపై ఓ అప్డేట్ను షేర్ చేసుకున్నాడు. ఈ సినిమా మ్యూజిక్ పనులు ఇప్పటికే ప్రారంభించేసామంటూ వెల్లడించాడు.
వాస్తవానికి ఇది చిన్న పోస్తే అయినా.. అభిమానుల్లో మాత్రం భారీ హైప్ మొదలైంది. సినిమా పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది. ఇందులో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో చేనున్నాడని టాక్. అంతేకాదు ఒక పాత్రలో నెగిటివ్ షేడ్స్‌లో కూడా బాలయ్య కనిపించనున్నాడట. ఈ క్రమంలోనే ఇప్పటికే సినిమాకు సంబంధించి ఎన్నో స్టోరీస్ మారుతున్నాయి. దీంతో అసలు గోపీచంద్ బాలయ్యను ఎలా చూపించబోతున్నాడని ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. వృద్ధి శ్రీనివాస్ బ్యానర్ పై సినిమా ప్రతిష్టాత్మకంగా రూపొందనుంది. ఇక సినిమా సెట్స్ పైకి వచ్చిన తర్వాత మరిన్ని వరుస అప్డేట్ లు ఇచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట.



