” అఖండ 2 ” మూవీ వీక్షించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్.. రియాక్షన్ ఇదే..!

రాష్ట్ర స్వయంసేవక్ సంఘ చీఫ్ అయినా మోహన్ భగవత్ కొద్ది గంటల క్రితం నందమూరి నట‌సింహం బాలకృష్ణ నటించిన అఖండ 2ను విక్షించారు. ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో స్పెషల్ సోను నిర్వహించారు మేకర్స్. ఈ షోను మోహన్ భగవత్ తో పాటు.. అఖండ 2 దర్శకుడు బోయపాటి శ్రీను.. అలాగే ప్రొడ్యూసర్స్ కూడా సినిమాను వీక్షించారు. ఇక సినిమా స్క్రీనింగ్ కంప్లీట్ అయిన తర్వాత అఖండ 2 మూవీ పై తన రివ్యూ షేర్ చేసుకున్నారు మోహన్ భగవత్.

ఆయనే మాట్లాడుతూ సినిమా చాలా బాగుందని.. అందులో హీరోలు అద్భుతంగా నటించారంటూ ప్రశంసలు కురిపించాడు. ఇక బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా మొదట సెప్టెంబర్ 25న రిలీజ్ చేయాల్సి ఉండగా.. కొన్ని కారణాలతో సినిమా వాయిదా వేసి డిసెంబర్ 5 కు రిలీజ్ డేట్‌ను మార్చారు. కానీ.. రిలీజ్‌కు కొద్ది గంటల ముందు ఫైనాన్షియల్ సమస్యల కారణంగా మరోసారి సినిమా వాయిదా పడింది. ఈ క్రమంలోనే ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తారు.

అయితే.. సినిమా కొత్త రిలీజ్ డేట్ లో ఇప్పటి వరకు అనౌన్స్ చేయకపోయినా.. దాదాపు సినిమాను మరో మూడు రోజులు అంటే డిసెంబర్ 12న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే థియేటర్ వద్ద కట్టిన బ్యానర్లు, కటౌట్లను తీయవద్దని ఇప్పటికే మేకర్స్ థియేట్రిక‌ల్‌ యాజమాన్యాలకు సూచించినట్లు తెలుస్తుంది. ఇక సినిమా రిలీజ్ డేట్ డిసెంబర్ 12 అఫీషియల్‌గా ప్రకటిస్తే మాత్రం డిసెంబర్ 11 రాత్రి నుంచి సినిమా ప్రీవియర్స్ పడే అవకాశం ఉంది.