ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో రిలీజై బాక్సాఫీస్ దగ్గర హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతున్న బాలీవుడ్ మూవీ దురంధర్. టాలెంటెడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ సినిమా సాలిడ్ సక్సెస్ అందుకుంది. అయితే.. ఈ సినిమా పలు రియల్ లైఫ్ ఇన్సిడెంట్లను ఆధారంగా తీసుకొని రూపొందించారు. ఇక సినిమాలోని ఎమోషన్స్‌కు ప్రతి ఒక్క ఇండియన్ సిటిజన్ కనెక్ట్ అవ్వాల్సిందే. ఆ రేంజ్‌లో సినిమాను రూపొందించారు. ఈ క్రమంలోనే సినిమాపై అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది.

ఇక తాజాగా.. ఈ సెన్సేషనల్ హిట్ మూవీ పై టాలీవుడ్ సీనియర్ బ్యూటీ రేణు దేశాయ్ రియాక్ట్ అవుతూ తన రివ్యూ షేర్ చేసుకుని ధురంధర్ సినిమా కచ్చితంగా ప్రతి ఒక్క ఇండియన్ సిటిజన్ చూడాల్సిన మూవీ అని.. డైరెక్టర్ ఆదిత్యధర్ బ్రిలియంట్‌గా పని చేశాడు అంటూ ప్రశంసల వర్షం కురిపించింది. మనల్ని క్షేమంగా ఉంచడానికి ఇండియన్ ఆర్మీ, రక్షణ దళం 24 గంటలు ఎంతగానో కష్టపడుతున్నారు. వాళ్ళ వల్లే వీరు రక్షణ స్వేచ్ఛను ఎంజాయ్ చేయగలుగుతున్నారు.

ఈ సినిమా చూస్తే కచ్చితంగా వాళ్ళ కష్టం ఏంటో మనకు అర్థమవుతుంది అంటూ రాసుకొచ్చింది. ఇక ఇటీవల కాలంలో భారత దేశంలో ఎన్నో ఫేక్ సెక్యులర్స్ వివాదాలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై రియాక్ట్ అవుతూ ఈ సినిమా చూసిన తర్వాత అయినా అందరికీ వాళ్ళ కస్టమర్ అర్థమవుతుందని.. ఇకనైనా సోడా సెక్యులర్స్‌గా ఉండడం మానుకొని.. మన దేశం వైపు ప్రతి ఒక్కరు నిజాయితీగా నిలబడాలంటూ.. ఫేక్ సెక్యులర్ పై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం రేణు దేశాయ్ రివ్యూ నెటింట వైరల్‌గా మారుతుంది.

