బాలకృష్ణ, బోయపాటి కాంబోలో రూనొందిన మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్ అఖండ 2 సడన్గా వాయిదా పడిన సంగతి తెలిసిందే. రిలీజ్ కొద్ది గంటల ముందు.. ఓ స్టార్ హీరో సినిమా ఇలా ఆగిపోవడంతో ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేశారు. కారణం ఏదైనా.. స్టార్ హీరో సినిమా ఇలా ఆగిపోవడం అనేది నిజంగా బిగ్ షాక్. అఖండ 2 రిలీజ్ ఆగడంపై తాజాగా టాలీవుడ్ బడా నిర్మాత.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత.. టీజీ విశ్వప్రసాద్ రియాక్ట్ అయ్యారు. విడుదలకు ముందు సినిమాలు ఆగిపోవడం నిజంగా దురదృష్టకరమని.. అది పరిశ్రమల వివిధ రంగాలపై ప్రభావం చూపుతున్నట్టు చెప్పుకొచ్చాడు.
సినిమా ఇక బాలకృష్ణ నటించిన అఖండ 2 రిలీజ్ వాయిదా పడడం నన్ను తీవ్రంగా కలవర పెట్టిదంటూ వెల్లడించ్చాడు. రిలీజ్ రోజున మూవీ వాయిదా వేయడం అనేది.. సినీ నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లకు, సాంకేతి, పర్యావరణ వ్యవస్థ లోని వేలాది కార్మికులకు కూడా ప్రభావం చూపిస్తుందని.. భవిష్యత్తులో మరోసారి ఇలా.. థర్డ్ పార్టీ (ఫైనాన్స్) వల్ల చివరి నిమిషంలో వచ్చే అంతరాయాలు ఆపడానికి స్పష్టమైన, చట్టపరమైన మార్గదర్శకాలు రూపొందించాలని..
ఇది చాలా ముఖ్యం అంటూ.. విడుదల టైంలో ఇలా సినిమా సడన్గా వాయిదా వేయడమంటే చాలా నష్టం కలుగుతుందని.. బాధ్యతరాహిత ప్రయత్నాలపై భవిష్యత్తులో నివారణ చర్యలు చేపట్టడానికి తగిన చట్టపరమైన చర్యలు రూపొందించాలని.. ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ముందుగా వాటిని క్లియర్ చేసుకోవాలంటూ టీజే విశ్వప్రసాద్ పేర్కొన్నాడు. ఇలా ఇబ్బందులు పెట్టకూడదని.. సమస్యలు అధిగమించి అఖండ 2 రిలీజ్ కావాలని ఎదురుచూస్తున్నాం అంటూ ట్విట్ షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం టీజీ విశ్వప్రసాద్ ట్విట్ వైరల్గా మారుతుంది. ఇక ప్రభాస్ హీరోగా నటించిన రాజాసాబ్‌కు ప్రొడ్యూసర్గా టీజీ విశ్వప్రసాద్ వ్యవహరించారు.



